'బింబిసార' సినిమా నుండి అదిరిపోయే అప్డేట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  కళ్యాణ్ రామ్ హీరోగా , నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అతనొక్కడే మూవీ తో కళ్యాణ్ రామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు, ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదలైన 118 అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తో కళ్యాణ్ రామ్ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.  ఇది ఇలా ఉంటే కళ్యాణ్ రామ్ 118 మూవీ తర్వాత ఎంత మంచి వాడవురా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు,  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకుంది.  

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ 'బింబిసార'  అనే సినిమాలో  ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు,  ఈ సినిమాను  కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.  ఈ మూవీ కథ గతంలోనూ ... వర్తమానంలోను నడుస్తూ ఉంటుందని అంటున్నారు,  అందు వలన కల్యాణ్ రామ్ రాజుగానే కాకుండా, మోడ్రన్ లుక్ తోను కనిపించనున్నాడని తెలుస్తోంది.  కీరవాణి ,  చిరంతన్ భట్ కలిసి పనిచేసిన ఈ మూవీ  కి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు,  ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు,  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్ర బృందం బయటికి వదిలింది,  ఏప్రిల్ 2 వ తేదీన  ఉదయం 11:34 నిమిషాలకు రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు,  ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: