త్రిబుల్ ఆర్ సినిమాపై ఆర్జివి మరో పోస్ట్.. నీ మొహం రా అంటూ?

praveen
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమా చివరికి మార్చి 22వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 500 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి తిరుగులేదు అని నిరూపించింది త్రిబుల్ ఆర్ సినిమా. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు కొమురంభీం పాత్రలో నటించిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోయారు.

 ఇప్పటికీ భారత దేశంలో ఎక్కడ చూసినా త్రిబుల్ ఆర్ సినిమా మేనియా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక త్రిబుల్ ఆర్ సినిమా చూసిన తర్వాత ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా త్రిబుల్ ఆర్ సినిమా పై స్పందించాడు తెలుగు పరిశ్రమకు దొరికిన ఒక అద్భుతం రాజమౌళి అని ఇక ఆయన తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు రామ్ గోపాల్ వర్మ.

 అంతేకాదు ఇటీవలే నీ దగ్గర ఇద్దరు పవర్ ఫుల్ మెన్స్ ఉంటే నా దగ్గర పవర్ఫుల్ ఉమెన్స్ ఉన్నారు అంటూ ఒక పోస్ట్ పెట్టారు.  ఇక ఇప్పుడు మరో సారి త్రిబుల్ ఆర్ సినిమా కు సంబంధించి మరో పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు రాంగోపాల్ వర్మ. త్రిబుల్ ఆర్ సినిమా అసలు బాగాలేదు అని సినిమాకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దు అంటూ కె ఏ పాల్ చేసిన వ్యాఖ్యలు ఉన్న ఒక వీడియో ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి నీ మొహం రా అంటూ ఆ వీడియోకి కామెంట్ జత చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇక ఇలా ఆర్జివి త్రిబుల్ ఆర్ సినిమా కు ఇస్తున్న సపోర్టుతో ఇద్దరు హీరోల అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv

సంబంధిత వార్తలు: