టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ స్పీడ్ చూపిస్తున్న కేతికశర్మ..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కేతిక శర్మ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు , ఈ ముద్దుగుమ్మ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరో గా తెరకెక్కిన రొమాంటిక్  మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమాలో కేతిక శర్మ తన అందచందాలతో ఎంతో మంది ఇది ప్రేక్షకులను ఫిదా చేసింది.  ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది,   ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయాన్ని చూసిన కేతిక శర్మ కు ఆ వెంటనే నాగ శౌర్య హీరో గా తెరకెక్కిన లక్ష్య మూవీ లో అవకాశం దక్కింది,  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కిన లక్ష్య కూడా మూవీ  కూడా కేతిక శర్మ కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది,  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన రెండు సినిమాలు కూడా ఈ ముద్దుగుమ్మకు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చాయి.  

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటించిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అవకాశాలు బాగానే వస్తున్నాయి,  అందులో భాగంగా ప్రస్తుతం కేతిక శర్మ , పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా గిరీసయ్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న రంగ రంగ వైభవంగా మూవీ లో  హీరోయిన్ గా నటిస్తోంది.   ఇలా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి,  ఇలా నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్  దగ్గర బోల్తా కొట్టినప్పటికీ కేతిక శర్మ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ మాత్రం తగ్గలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: