హెల్మెట్ ఖచ్చితంగా ఉపయోగించాలి...సాయి ధరమ్ తేజ్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు , ఈ యంగ్ హీరో  మొదటగా వైవియస్ చౌదరి దర్శకత్వంలో రేయ్ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టినప్పటికీ, మొదటగా  పిల్లా నువ్వు లేని జీవితం సినిమా విడుదల అయ్యింది.  ఇది ఇలా ఉంటే పిల్లా నువ్వు లేని జీవితం మంచి విజయం సాధించడంతో సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా తోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు,  పిల్లా నువ్వు లేని జీవితం మూవీ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , సుప్రీమ్ మూవీ లు కూడా మంచి విజయాన్ని సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సాయి ధరమ్ తేజ్ క్రేజీ హీరోగా మారిపోయాడు.  ఇలా వరుస విజయాలను అందుకున్న సాయి ధరమ్ తేజ్  కొంత కాలం పాటు బాక్స్ ఆఫీస్ వద్ద వరుస పరాజేయలతో   డీలా పడిపోయాడు,  అలాంటి సమయం లోనే సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి , ప్రతి రోజు పండగే మూవీ లు మంచి విజయాలు సాధించడంతో సాయి ధరమ్ తేజ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.  

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరో గా కొనసాగుతున్న సాయి ధరమ్ తేజ్ కు ఆ మధ్య కేబుల్ బ్రిడ్జ్ వంతెన పై యాక్సిడెంట్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే,  ఇది ఇలా ఉంటే తాజాగా సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జి పై జరిగిన యాక్సిడెంట్ గురించి స్పందించాడు.  కేబుల్ బ్రిడ్జి వంతెన పై జరిగిన యాక్సిడెంట్ సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది అని సాయి ధరమ్ తేజ్ తెలియజేశారు, వాహనదారులు వాహనాలను నడిపే సమయంలో హెల్మెట్ ధరించి తమ అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవాలి అని సాయి ధరమ్ తేజ్ తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: