ఆర్.ఆర్.ఆర్ తొలి రోజు కలెక్షన్ అంచనా ఎంతో తెలుసా...?

murali krishna
ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా ప్రేక్షకులు మాట్లాడుకొనే తెలుగు సినిమా RRR. ఈ చిత్రంపై రోజు రోజుకు కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అడ్వాన్స్ బుకింగ్‌లో అయితే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.ఈ నేపథ్యంలో rrr తొలి రోజు ఎంత మేరకు కలెక్షన్లను వసూలు చేస్తుందనే ప్రశ్న ట్రేడ్ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతున్నదట.. rrr సినిమా తొలి రోజు అంచనా వసూళ్ల వివరాల్లోకి  మనం వెళితే..
 
RRR సినిమాకు సంబంధించి గత మూడు రోజులుగా అడ్వాన్స్ బుకింగ్‌కు అభిమానులు తెగ పొటేత్తారు. దాంతో రిలీజ్‌కు ముందే భారీ వసూళ్లు నమోదు అయ్యాయట.రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుపోతున్నాయట. అడ్వాన్సు బుకింగ్ మొదలైన ప్రతీ చోట కూడా హౌస్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో rrr సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
 
RRR సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం.. నైజాంలో తొలి రోజు 25 కోట్ల షేర్ నమోదు చేయడం పక్కా అంటున్నారు. ఇక సీడెడ్‌లో 15 కోట్ల షేర్ అలాగే ఆంధ్రాలోని అన్ని జిల్లాలో 35 కోట్ల వరకు షేర్ రాబట్ట వచ్చని వారు అంచనాలు వేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో కలిపి సుమారు 70 నుంచి 75 కోట్ల షేర్ రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు బాగా లెక్కలు వేస్తున్నాయి.
 తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే కనుక దక్షిణాదిలో కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ బాగా జరిగింది. కరెంట్ షోలతోపాటు వచ్చే వసూళ్లు కూడా భారీగా ఉంటాయనే మాట వినిపిస్తున్నది. కర్ణాటకలో తొలి రోజు 15 కోట్ల మేర వసూళ్లు నమోదు అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక తమిళనాడులో 7 కోట్లు, కేరళలో 2.5 కోట్లు వసూలయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మిగితా రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం 20 కోట్ల మేర రాబట్ట వచ్చనే ఛాన్స్ ఉంది.
 
RRR సినిమా ఫీవర్ ఓవర్సీస్‌లో ఇప్పటికే బాగా అంటుకొన్నది. పలు దేశాల్లో మంచి స్పందన కూడా కనిపిస్తున్నది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్ దేశాల్లో భారీ వసూళ్లు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో 8 మిలియన్ డాలర్లు అంటే మొత్తంగా 60 కోట్ల రూపాయలు తొలి రోజున రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నారు.
 
RRR ట్రేడ్ వర్గాల్లో లెక్కలను బట్టి చూస్తే.. భారతీయ సినిమా చరిత్రలో కనీవిని ఎరుగని రికార్డు కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది. బాహుబలి 2 సినిమా విషయానికి వస్తే  ఆ చిత్రం 125 కోట్ల తొలి రోజున రాబట్టిందట.. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తే rrr చిత్రం 150 నుంచి 160 కోట్ల షేర్‌ను తొలి రోజు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు బాగా ధీమాగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: