అనుష్క ఇన్ని సినిమాలను మిస్ చేసుకుందా..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో ఒకరు చేయవలసిన సినిమాలను మరొకరు చేయడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం,  అలా ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడానికి ప్రధాన కారణం,  ఆ సమయంలో వారికి ఆ సినిమా కథ నచ్చకపోవడం లేదా డేట్ లు కుదరకపోవడం లేక మరి ఏదైనా కారణాల కావచ్చు,  అలా అనుష్క కూడా తన సినీ కెరియర్ లో ఎన్నో సినిమాలను  వదులుకుంది, అలా అనుష్క తన కెరియర్ లో వదులుకున్న సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కొచ్చాడియాన్ సినిమాలో మొదట అనుష్క హీరోయిన్ గా సంప్రదించారట,  కాకపోతే అనుష్క నిరాకరించడంతో ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది.
పొన్నియన్ సెల్వన్ మూవీ లో కూడా అనుష్క కు అవకాశం వచ్చిందట, కాకపోతే ఈ ముద్దుగుమ్మ ఆ అవకాశాన్ని రిజెక్ట్  చేసిందట.
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రెబల్ సినిమాలో ముందుగా అనుష్క కు అవకాశం దక్కిందట,  కాకపోతే అనుష్క ఈ మూవీ ని రిజెక్ట్ చేసిందట.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన దొంగాట సినిమాలో కూడా మొదట అనుష్క కు అవకాశం వచ్చిందట, ఈ సినిమాను కూడా అనుష్క కొన్ని కారణాల రిజెక్ట్ చేసిందట.
అనుష్క ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే,  ఈ సినిమా సీక్వెల్ ను  తీయాలని కోడి రామకృష్ణ అనుకున్నారట,  కాకపోతే అనుష్క ఒప్పుకోకపోవడంతో  ఈ సినిమా ఆగిపోయిందట.
కాంచన సినిమాలో ముందుగా  నాగార్జున, అనుష్క  ను అనుకున్నారట, ముందుగా నాగార్జున ఒప్పుకోకపోవడంతో ఆ  తర్వాత అనుష్క కూడా ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట.
మనం సినిమాలో కూడా అనుష్క కు అవకాశం వచ్చిన,  ఇతర సినిమాలతో  బిజీ గా ఉండడం వల్ల ఈ అవకాశాన్ని అనుష్క వదులుకుందట.
ఆచార్య సినిమాలో కూడా అనుష్క ను హీరోయిన్ గా అనుకున్నారట,  కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు అనుష్క నో  చెప్పిందట.
వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నారప్ప సినిమాలో కూడా అనుష్క కు అవకాశం వచ్చిందట,  కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు  కూడా అనుష్క నో చెప్పిందట.
ఇలా అనుష్క తన కెరియర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: