సోలో లైఫ్ సో బెటర్ అంటోన్న హీరోయిన్లు..!

NAGARJUNA NAKKA
టబుకి నైంటీస్‌ యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ ఉండేది. ఆ క్రేజ్‌తోనే టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది టబు. అయితే రొమాంటిక్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో భారీ హిట్స్‌ అందుకున్న టుబు, మేరీడ్‌ లైఫ్‌కి మాత్రం దూరంగానే ఉండిపోయింది. 51 ఏళ్ల వయసులోనూ సినిమాలతోనే బిజీ అయిపోయింది. అయితే టబు సింగిల్‌గా ఉండిపోవడానికి టాలీవుడ్‌లో ఒక సీనియర్‌ హీరోతో లవ్‌ స్టోరీయే కారణమని చెప్తుంటారు ఇండస్ట్రీ జనాలు.
ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళీ, హిందీ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది శోభన. సినిమాల్లో ఉత్తమ గృహిణి పాత్రల్లో కనిపించిన శోభన, రియల్‌ లైఫ్‌లో మాత్రం పెళ్లి చేసుకోలేదు. 51 ఏళ్ల వయసులోనూ శాస్త్రీయ నృత్యానికి సేవ చేయడానికి నాట్యానికే అంకితమైంది. అయితే శోభన పెళ్లి చేసుకోకపోవడానికి ఒక స్టార్ హీరోతో బ్రేకప్‌ కావడమే కారణమంటున్నారు.
నగ్మ బాటలోనే నగ్మ చెల్లెలు జ్యోతిక సినిమాల్లోకి వచ్చింది. తమిళస్టార్ సూర్యని పెళ్లి చేసుకుని ఫ్యామిలీలైఫ్‌లోకి వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక మళ్లీ సినిమాల్లోకి వచ్చింది. అయితే నగ్మ మాత్రం 47 ఏళ్లు దాటినా పెళ్లికి దూరంగా ఉండిపోయింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో బ్రేకప్‌ కావడం వల్లే నగ్మ పెళ్లి చేసుకోలేదనే ప్రచారం జరుగుతోంది.
సుస్మితా సేన్‌ పెళ్లి గురించి మొన్నటి వరకు చాలా డిస్కషన్స్ జరిగాయి. మోడల్‌ రోహమాన్‌ షాల్‌తో ఏడడుగులు వేస్తుందనే ప్రచారం జరిగింది. కానీ ఏమైందో ఏమో వీళ్లిద్దరు విడిపోయారు. అప్పటికే అరడజను వరకు బ్రేకప్‌లు చూసిన సుస్మిత ఇప్పుడు ప్రేమ, పెళ్లి రెండిటికి దూరంగానే ఉంది. అయితే 46 క్రాస్‌ చేసిన సుస్మిత థర్టీస్‌లోనే ఇద్దరు ఆడపిల్లలని దత్తత తీసుకుని అమ్మ అయ్యింది.
అమీషా పటేల్ 'కహోనా ప్యార్ హై, బద్రి, గదర్' సినిమాల టైమ్‌లో కుర్రాళ్లకి పిచ్చెక్కించింది. లవ్‌స్టోరీస్‌తో భారీ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. అయితే 45 ఏళ్లు వచ్చినా అమీషా పటేల్‌ పెళ్లి అనే మాటకి దూరంగా ఉండిపోయింది. బిజినెస్‌మెన్ కనవ్‌ పూరీతో విడిపోయాక అమీషా లైఫ్‌లో మళ్లీ లవ్‌ పుట్టిందనే ప్రచారం జరిగినా, ఈ మాజీ హీరోయిన్‌ మాత్రం పెళ్లి చేసుకోలేదు. సితార, దివ్య దత్తా లాంటి మాజీ హీరోయిన్లు కూడా సోలో లైఫ్‌నే ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే ఆర్.నారాయణ మూర్తి లాంటి బ్యాచిలర్స్‌ లైఫ్‌లో ఒక తోడుండాలి, పెళ్లి చేసుకోవాలి అని చెప్తోన్నా వీళ్లు మాత్రం వాళ్ల వాళ్ల రీజన్స్‌తో సింగిల్‌గా ఉండడానికే ఇష్టపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: