మెగాస్టార్ సినిమా లో అలనాటి సీనియర్ నటి..?

Anilkumar
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పై కొత్త కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక సీనియర్ నటి నటించబోతుంది అనే వార్త వినిపిస్తోంది. ఒక వేళ నటిస్తే ఆ నటి ఎవరు? అయితే ఆ నటి ఎవరు అంటే కళ్లతోనే మాయ చేసిన అలనాటి నటి ఆమె, అందం, అభినయం కలబోసిన ఆ నటినే 'ముచ్చెర్ల అరుణ'.ఇకపోతే  ఆమె కన్నులు కలువ పూలులా ఉంటాయి. అంతేకాదు ఆ కలువ కళ్లతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన ఆమె మన తెలుగమ్మాయే. అయితే ఒకప్పుడు స్టార్ క్రేజ్ ఉన్న ఈమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి కేవలం ఇంటికే పరిమితం అయింది.

ఇదిలా ఉంటే తాజాగా గత ఏడాది నుండి ఈమె సినిమాలు చేయడానికి ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఇక ఏదైనా ఉంటే ఇటీవల ఈమె ఓ మలయాళ సినిమాలో నటించడం జరుగుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇదే క్రమంలో ఆమెకు మెగాస్టార్ నుంచి ఒక పిలుపు వచ్చిందని ఆయన సినిమాలు నటించాలి అని చెప్పడంతో ఒక ప్రత్యేకమైన పాత్రలో ఈమె కనిపించబోతోంది అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఏమిటి ఎలా కనిపించబోతుంది అనేది చూడాలి.ఆమె ఏ పాత్ర చేయబోతుంది ? ఆమె పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయా ? లేక పక్కా ఎమోషనల్ పాత్రలో 'ముచ్చెర్ల అరుణ' కనిపించబోతుందా ?  అనేది మాత్రం ఇంకా తెలియదు.

ఇక ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం మలయాళ వెర్షన్ లో 'మంజు వార్యర్' పాత్రనే తెలుగులో 'ముచ్చెర్ల అరుణ' చేయబోతోందట. అంతేకాదు ఈ పాత్ర హీరోకి చెల్లి పాత్ర. చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అయితే నిజానికి తెలుగు వర్షన్ లో ఈ పాత్రలో సీనియర నటి శోభన నటించబోతున్నట్లు ఆ మధ్య బాగా వార్తలు వినిపించాయి. ఇకపోతే ఆ తర్వాత కుష్బూ పేరు వినిపించింది.ఇక ప్రస్తుతం  ఇప్పుడు 'ముచ్చెర్ల అరుణ' పేరు వినిపిస్తోంది.అయితే  మొత్తానికి ఈ ఒక్క పాత్ర పైనే ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. ఇకపోతే మొదట్లో సుహాసిని కూడా నటిస్తోంది అన్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: