సీఎం గా పవన్ కళ్యాణ్.. RGV షాకింగ్ పోస్ట్?

praveen
ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఎందుకంటే ఆయన చేసే సినిమాలు.. మాట్లాడే మాటలు.. పెట్టే పోస్టులు అన్నీ కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగానే ఉంటాయి. అంతేకాదు ఆయన మాటలు ఎప్పుడూ యువతనీ బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారు కదా.. ఇంకెవరు రాంగోపాల్ వర్మ. ఒకప్పుడు ఆయన సినిమాలతో సెన్సేషన్ సృష్టించాడు కానీ ఇప్పుడు మాత్రం వివాదాలతోనే సెన్సేషనల్  దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎప్పుడూ  ఊహకందని రీతిలో పోస్టులు పెడితే సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ.

 ముఖ్యంగా రాజకీయ నాయకులు సినీ తారల నే టార్గెట్గా చేసుకుంటూ ఎప్పుడూ తనదైన శైలిలో కౌంటర్లు పేలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పటి వరకు తనకు నచ్చని వారి జీవిత కథను బయోపిక్ తెరకెక్కించి సంచలనమే సృష్టించాడు. అయితే ఇటీవలే వర్మ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.. ప్రజాశాంతి పార్టీ అధినేతకు కే ఏ పాల్ పై సెటైర్లు వేస్తూ రాంగోపాల్ వర్మ ఒక వీడియో ని షేర్ చేశాడు. దేశానికి కాబోయే ప్రధాని నేనే అంటూ కె ఏ పాల్ మాట్లాడిన వీడియో షేర్ చేస్తూ దానికి పవన్ కళ్యాణ్ ని కూడా ట్యాగ్ చేశాడు.

 ఇది కాస్తా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.. పవన్ కళ్యాణ్ ఫాన్స్ అందరు కూడా ప్రజాశాంతి పార్టీ లో చేరండి 42 ఎంపీలు గెలిచి ప్రధానమంత్రి అవుతాను అప్పుడు ఏపీ సీఎం గా పవన్ కళ్యాణ్ అవుతాడు నా మాట ఆలకించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్ సిద్ధం కావాలి అంటూ కే ఏ పాల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.. ఇక ఇదే వీడియో ఆర్జివి కంట పడటంతో అస్సలు లేట్ చేయకుండా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది వర్మ పోస్టు చేసిన తర్వాత వైరల్గా మారకుండా ఉంటుందా.. సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది ఈ వీడియో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: