యూట్యూబ్ లో దూసుకుపోతున్న సూర్య 'ఈటి' ట్రైలర్..!

Pulgam Srinivas
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు,  ఈ హీరో తమిళ నాట నటించిన దాదాపు ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేస్తూ ఉంటాడు,  అలా విడుదల చేయడం మాత్రమే కాకుండా ఆ సినిమాలతో ఇప్పటి వరకు ఎన్నో విజయాలను కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.  ఇది ఇలా ఉంటే సూర్య,  మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గజిని సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు, ఆ తర్వాత సూర్య హీరోగా తెరకెక్కిన 'సింగం' సిరీస్ సినిమాలు  కూడా తెలుగు నాట మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి.

ఈ సినిమాలు  మాత్రమే కాకుండా ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో కూడా సూర్య టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు,  కోలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ను సంపాదించుకున్న సూర్య తాజాగా ఈటి సినిమాలో హీరోగా నటించాడు,  ఈ సినిమా కూడా  తమిళ్ పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది,  ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.  ఈ సినిమా ట్రైలర్ విడుదలైన అప్పటి నుండి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకుంటుంది,  ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.  అలాగే ఈ మూవీ లో వినయ్ రాయ్, సూరి, సత్యరాజ్  ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు,  ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాకు ఇమ్మన్ సంగీతం సమకూర్చగా సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మించారు, ఎన్నో అంచనాలతో మార్చి 10 వ తేదిన విడుదల కాబోయే ఈ సినిమా థియేటర్ ల వద్ద ఏ రేంజ్ లో విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: