అప్పట్లో చిరంజీవి.. ఇప్పట్లో బెల్లంకొండ శ్రీనివాస్.. కారణం ఏమిటంటే..?

Divya
మెగాస్టార్ చిరంజీవి అటు వెండితెర , బుల్లితెర, బాలీవుడ్ ఇటు సౌత్ ఇండియా ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు చిరంజీవి. చిరంజీవి రూట్ లోనే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా నడుస్తున్నాడు అనే వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అప్పట్లో చిరంజీవికి.. ఇప్పట్లో బెల్లంకొండ శ్రీనివాస్ కు మాత్రమే ఈ ఘనత సాధ్యమైంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి..

గతంలో చిరంజీవి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే చిరంజీవి బాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో.. రాజశేఖర్ హీరోగా నటించిన అంకుశం సినిమాను  హిందీ రీమేక్ తో ప్రతిబంధ్ సినిమా గా మార్చి బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. తెలుగు లో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఇక బాలీవుడ్ లోకి హీరోగా చిరంజీవితో పాటు డైరెక్టర్ గా రవిరాజా పినిశెట్టి కూడా ఎంట్రీ ఇవ్వడం అదే మొదటిసారి. ఇక నిర్మాతగా అల్లు అరవింద్ కూడా ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం..

అంతేకాదు నటుడు రామిరెడ్డి కూడా ఇదే సినిమా ద్వారా మొదటిసారి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి సినిమాతో హిందీ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ సినిమాకు దర్శకుడిగా వివి వినాయక్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి..

హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన వినాయక్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఇకపోతే బాలీవుడ్లో చిరంజీవి తొలి సక్సెస్ అందుకున్నట్లు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా బాలీవుడ్లో తొలి హిట్ అందుకోవాలి అని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: