గంగూభాయ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Divya
గంగూభాయ్ కథియావాడి.. నేచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఆలియా భట్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోయిన్ గా నటించి త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ . ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆలియా విభిన్న పాత్రలతో నటించి ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటుంది. ఆలీయా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25వ తేదీన .. పవన్ కళ్యాణ్ .. రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లానాయక్ సినిమా తో పోటీగా అన్ని భాషలలో విడుదలై మంచి టాక్ ను సంపాదించుకుంది..

తెలుగులో భీమ్లా నాయక్.. తమిళ్ లో వలీమై వంటి చిత్రాలు విడుదల అయినప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టడం  గమనార్హం. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ సినిమాలకు ఉండే క్రేజ్ ఏంటి అనేది ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అవ్వడం జరిగింది. ఇకపోతే మొదటివారం ఈ సినిమా ఎంత కలెక్షన్ లు రాబట్టింది అనే విషయం మనం ఒకసారి తెలుసుకుందాం.
ఆలియా నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా మొదటి రోజు బాక్సాపీస్ వద్ద ఏకంగా రూ. 10.50 కోట్లను రాబట్టింది. ఇక రెండవ రోజు రూ. 13.32కోట్లు రాబట్టగా.. మూడవరోజు రూ.15.30 కోట్లు వసూలు చేసి రేసుగుర్రంలా దూసుకుపోతోంది. మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా రూ.39.12కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత భారీగా షేర్ కలెక్ట్ చేసినప్పటికీ.. విడుదలకు ముందు ట్రైలర్, టీజర్లతో ఎన్నో వివాదాలు సృష్టించిన సంచలనం రేపింది. నిజానికి సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించే ఏ సినిమా అయినా సరే విడుదలకు ముందు ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సినిమా కూడా ఇలా వివాదాలు సృష్టించడం చాలా గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: