ఈ వారం విడుదల అవుతున్న మూవీస్..!!

Divya
ప్రస్తుతం హీరోల సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత స్టార్ హీరోల సినిమాలు అన్ని ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. ఇక ఇలాంటి తరుణంలో స్టార్ హీరోల సినిమాలు కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి విడుదల చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో భిమ్లా నాయక్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక దీంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఈ వారంలో విడుదల అయిన సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

1). శర్వానంద్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ చిత్రం ఏమిటంటే ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా నిన్నటి రోజున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా జరుపుకున్నది. ఇందులో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. సినిమా వచ్చే నెల 4వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది.

2). మమ్ముట్టి కొడుకుగా సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న  హీరో ఎవరంటే దుల్కర్ సల్మాన్. తాజాగా ఈయన నటించిన చిత్రం "హేయ్ సినామిక"ఈ చిత్రంలో హీరోయిన్ కాజల్ తో పాటు అతిథి రావు హైదరి కూడా నటిస్తున్నది. ఇక ఈ సినిమా కూడా మార్చి 3వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది.

3). డైరెక్టర్ మాట్ రివ్స్ తెరకెక్కించిన చిత్రం ది బ్యాట్ మాన్ . ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో  ఆండ్రూ జాక్ కరోనా కారణం చేత మరణించారు. అందుచేతనే ఈ సినిమాని కొద్ది రోజులు వాయిదా బేసిక్స్ షూటింగ్ని చేయడం జరిగిందట. అందుచేతనే ఈ సినిమాని పూర్తిచేసుకుని మార్చి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఇక ఈ సినిమా లలో ఏ సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: