హిట్ లేకపోయినా రెమ్యునరేషన్ తగ్గని యంగ్ హీరో..?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు హిట్లు, ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అలాగే రెమ్యునరేషన్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా భారీగా పెంచేస్తున్నారు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఒకప్పుడు మంచి విషయాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి విజయం రావడమే గగనం అయిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'మహా సముద్రం' సినిమా శర్వానంద్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో మళ్ళీ తనకు ఇష్టమైన జోనర్లోనే సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు శర్వానంద్. 

అందులో భాగంగానే శర్వానంద్ లేటెస్ట్ గా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అలనాటి సీనియర్ హీరోయిన్స్ అయిన రాధిక శరత్ కుమార్, ఊర్వశి, కుష్బూ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాని మొదట ఫిబ్రవరి 25న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' పెద్ద ఎత్తున థియేటర్స్ లో విడుదల అవుతుండటంతో..

 ఈ సినిమా విడుదల వాయిదా వేశారు. మార్చి 4 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఇక ఈ సినిమాతో మంచి హిట్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న శర్వానంద్ రెమ్యూనరేషన్ మాత్రం పది కోట్లకు చేరుకుంది. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా తర్వాత శర్వానంద్ మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి యువీ సంస్థకు చెందినది, మరొకటి పీపుల్స్ మీడియా కు చెందినది. అయితే వీటిలో పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న సినిమా కోసం శర్వానంద్ 10 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వరుస ప్లాపులు వెంటాడుతున్నా.. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అసలు తగ్గలేదట ఈ యంగ్ హీరో...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: