నభా ను ఎవరు పట్టించుకోవట్లేదేంటి!!

P.Nishanth Kumar
సినిమా పరిశ్రమలో కొంతమంది అదృష్టం ఎప్పుడు ఏ విధంగా మారుతుందో ఎవరు చెప్పలేము. ముఖ్యంగా హీరోయిన్లు సినిమాలు చేసే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంతో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే వారి కెరియర్ ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేము. హిట్ వచ్చిన ప్రతిసారి వారి కెరీర్ ముందుకు దూసుకుపోతుంది అన్నట్లుగానే ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి వారి కెరియర్ ముగిసిపోయింది అనే విమర్శలు రావడం దాదాపుగా సినిమా పరిశ్రమలో జరుగుతూ ఉంటుంది.

ఈ నేపథ్యంలో తెలుగులో మంచి సినిమాలను చేసుకుంటూ పోతున్న కూడా ఓ హీరోయిన్ కు పెద్ద సినిమాల అవకాశాలు రావడం లేదు అయితే సదరు సినిమాలు హిట్ కాకపోవడం కూడా ఆమె అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా.. ఇస్మార్ట్ శంకర్ సినిమా లో తెలంగాణ అమ్మాయిలా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకునీ మంచి హీరోయిన్ అనిపించుకున్న నభా నటేష్. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రేక్షకులను భారీస్థాయిలో అలరిస్తుంది.

తనకే సొంతమైన నటనతో అందంతో అభినయంతో ప్రేక్షకులకు ఇంత వరకు అలరిస్తూ వచ్చిన ఈమెకు పెద్ద సినిమాల అవకాశాలు రాకపోవడం నిజంగా నిరాశ జనకమైన వార్త అని చెప్పాలి. ఈమె ప్రస్తుతం చేస్తున్న సినిమాల సంఖ్య పెద్దగా లేదనే చెప్పాలి ఈమెతో పాటు సినిమా పరిశ్రమలోకి వచ్చిన హీరోయిన్లు పెద్ద సినిమాలతో పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు పోతుండగా ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు రావడం గగనం అయిపోవడం ఆమె అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచే వార్త. మరి ఈ ముద్దుగుమ్మ కు ఇస్మార్ట్ శంకర్ లాంటి మరొక సినిమా వస్తే కానీ ఆమె కెరీర్ గాడిలో పడదు. మరి అలాంటి సినిమా ఆమెకు ఎప్పుడు వస్తుందో చూడాలి. నటన విషయంలో ఏమాత్రం వేలుపెట్టని విధం గా చేసే ఈ ముద్దుగుమ్మ ఈ కష్టాలు ఏంటో మరీ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: