చీరకట్టులో మైమరిపిస్తున్న ఖిలాడి బ్యూటీ..!

Pulgam Srinivas
కొంతమంది హీరోయిన్ లు ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటూ ఉంటారు, మొదటి సినిమాతోనే మంచి రెస్పాన్స్ అందుకున్న హీరోయిన్ లకు ఆ తర్వాత కూడా క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతూ ఉంటాయి,  అలా మొదటి సినిమా తోనే మంచి క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాన్ని దక్కించుకున్న ముద్దుగుమ్మలలో మీనాక్షి చౌదరి ఒకరు.  మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది,  ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటనకు, హవా భావాలకు,  అందచందాలకు  ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది, ఇలా మీనాక్షి చౌదరి నటించిన మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకోవడంతో  ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి సినిమాలో మీనాక్షి చౌదరి అవకాశాన్ని దక్కించుకుంది,  ఈ సినిమా ఫిబ్రవరి 11 వ తేదీన థియేటర్ లలో  విడుదలైంది.
  ప్రస్తుతం కూడా ఖిలాడి సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది,  ఇది ఇలా ఉంటే ఖిలాడి సినిమాలో ఈ ముద్దుగుమ్మ అందచందాలకు మంచి మార్కులు దక్కడంతో వరుస పెట్టి క్రేజీ సినిమా అవకాశాలు మీనాక్షి చౌదరి కి వస్తున్నట్లు తెలుస్తోంది.  ఇలా సినిమాలతో ప్రేక్షకులకు అలరిస్తున్న మీనాక్షి చౌదరి సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది,  తాజాగా కూడా మీనాక్షి చౌదరి కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో మీనాక్షి చౌదరి అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని, బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి పిక్స్ కు స్టిల్స్ ని ఇచ్చింది.  ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు ప్రిన్సెస్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్ లను పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: