లిరిక్ తో షేక్ చేస్తున్న విజయ్..!!

Divya
తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం బిస్ట్.. ఇందులో కథానాయికగా పూజ హెగ్డే నటిస్తోంది.. అంతే కాకుండా ఈ సినిమాపై తను ఎంతో హోప్ పెట్టుకున్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఇక ఇ సినిమాకి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ వ్యవహరిస్తున్నారు. ఇందులో కథానాయికగా పూజాహెగ్డే కావడం వల్ల ఆమె అభిమానులు కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఈ మూవీపై. అయితే ఒకేసారి సినిమాని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉన్నది. ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను కూడా విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ సినిమాకి నెల్సన్ మరియు అనిరుద్ లు కలిసి కుత్తును ప్లాన్ చేశారు. గతంలో కూడా అనిరుధ్ కొలవెరి సాంగ్ కూడా బాగా పాపులర్ చేశారు.. ఇప్పుడు అదే స్థాయిలో ఈ అరబిక్ కుత్తు పాటను కూడా అదే స్థాయిలో ఉందని ప్రచారం చేశారు. ఇక ఈ పాటను విడుదల ప్రకటిస్తూ యూనిట్ సభ్యులు ఒక పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఫోటోలు పూజా హెగ్డే కుర్రకారును ఫిదా చేసేలా కనిపిస్తోంది.. ఇక ఈ పోస్టర్ లో ఆమె అరబిక్ కుత్తు పాటకు తగ్గట్టు గానే కనిపిస్తోంది.
పూజా హెగ్డే ఇందులో లుక్స్ చాలా బాగున్నదని చెప్పవచ్చ.. విజయ్ కు ఈ సినిమాలో సరిజోడి అన్నట్లుగా ఉంది పూజా హెగ్డే.. ఇక ఈ సినిమా తర్వాత తమిళంలో కచ్చితంగా బిజీ హీరోయిన్లలో మారుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ లిరికల్ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.. కేవలం 76 నిమిషాల్లోనే..1.5 మిలియన్ల వ్యూస్ రావడం జరిగింది.. సీరియల్ ఇక వీటితో పాటే 1.1 మిలియన్ల లైక్స్ కూడా వచ్చాయి. విజయ్ పూజా హెగ్డే డాన్స్ ప్రేక్షకులను బాగా బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్  కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: