ఈ హీరోయిన్ కి స్టార్ ఫీచర్స్ ఉన్నాయే!!

P.Nishanth Kumar
ఈరోజుల్లో హీరోయిన్ అవ్వాలన్న స్టార్ హీరోయిన్ అవ్వాలంటే భారీ స్థాయిలో గ్లామర్ చూపించాల్సిందే. అందులోనూ టాలీవుడ్ సినిమా పరిశ్రమ లాంటి కమర్షియల్ సినిమా ఇండస్ట్రీలో తప్పకుండా హీరోయిన్లు తమ అందాలతో ప్రేక్షకులను ఫిదా చేయాలి. అంతే కాదు హద్దులు పెట్టుకోకుండా శృంగార సన్నివేశాల్లో సన్నివేశాలలో నటించాలి. అప్పుడే ఆమెకు భారీ గుర్తింపు వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగుతుంది. అలా తెలుగు సినిమా పరిశ్రమలో భారీ ప్రభంజనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అలాంటి సినిమాలు చాలానే తెర మీదకు వచ్చాయి.

కానీ అవి కూడా అర్జున్ రెడ్డి స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేదు. అర్జున్ రెడ్డి సినిమా వచ్చి చాలా రోజులు అయిపోతుంది కూడా. ఈ సినిమాను పోలిన సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆ విధంగా ఇటీవలే అర్జున్ రెడ్డి సినిమా గా వర్ణిస్తున్నారు డీజే టిల్లు సినిమాను సిద్ధార్థ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుందని కొంత మంది సినీ పండితులు జోస్యం చెబుతున్నారు.

తెలుగు సినిమా హీరోయిన్ ఏ విధమైన సినిమాలు చేయాలో ఏ విధంగా సినిమాలలో నటించాలో అచ్చం ఆ విధంగానే నటిస్తూ ఈ ముద్దుగుమ్మ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఈ చిత్రం ద్వారా అలరించబోతోంది. ఆమె ఏ స్థాయిలో నటించిందో ఈ చిత్రం యొక్క టీజర్ మరియు ట్రైలర్ ను బట్టి అందరికీ అర్థం అవుతుంది. ఈ చిత్రంలోని బోల్డ్ సన్నివేశాలలో ఆమె ఎంతో హాట్ గా నటించగా ప్రేక్షకులందరినీ కట్టిపడేస్తుంది అని చెప్పవచ్చు. చాలామంది ప్రేక్షకులు ఆమె కోసమైనా ఈ సినిమా చూసి తీరాల్సిందే అని అంటున్నారు. మరి టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్లకు బాగా కరువు ఏర్పడిన నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందా అనేది చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: