'ఊ అంటావా' పాటకి అదిరిపోయే స్టెప్స్ వేసిన బన్నీ హీరోయిన్.. రిప్లై ఇచ్చిన ఐకాన్ స్టార్..!!

Anilkumar
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పుష్ప సినిమా మేనియా దేశవిదేశాలను దాటుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని సాంగ్స్ కి ప్రతి ఒక్కరు తమ దైన శైలిలో స్టెప్పులు వేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురం లో ని బుట్ట బొమ్మ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి పుష్ప సినిమాలోని సమంతా నర్తించిన 'ఊ అంటావా మామ' సాంగ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. 

ముఖ్యంగా ఈ పాట యూట్యూబ్లో తక్కువ సమయంలోనే 100 మిలియన్ల వ్యూస్ అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలకు సోషల్ మీడియాలో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇలా ఉంటే తాజాగా ఈ చిత్రంలోని 'ఊ అంటావా మామా.. ఊ ఊ అంటావా మామా' అనే పాటకు టాలీవుడ్ నటి శ్రద్ధాదాస్ అదిరిపోయే స్టెప్పులు వేసింది. తన సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో షేర్ చేస్తూ..' పుష్ప హ్యాంగోవర్ అని.. జస్ట్ ఫర్ ఫన్' అని క్యాప్షన్స్ పెట్టింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతుంది. 

అంతేకాకుండా శ్రద్ధాదాస్ వీడియో ని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అల్లు అర్జున్ సైతం ఈ వీడియో కి రిప్లై ఇచ్చాడు. ఈ వీడియో కింద బన్నీ.. '100 వ దశ భ్రాంతి' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక గతంలో అల్లు అర్జున్ ఆర్య 2 సినిమాలో శ్రద్దాదాస్ నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు బన్నీ పాటకి శ్రద్ధాదాస్ అదిరిపోయే స్టెప్పులు వేయడంతో ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక గత ఏడాది డిసెంబర్ 17 న విడుదలైన ఈ సినిమా ఇండియన్ టాప్ గ్రాసర్ గా నిలిచింది. ముఖ్యంగా సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ సినిమా భారి కలెక్షన్స్ ను సాధించింది. దీంతో బన్నీ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: