కోనా వెంకట్ తో బిగ్ బాస్ ప్రియాంక సింగ్.. సంథింగ్ స్పెషల్..!

shami
బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన వాళ్లలో ప్రియాంకా సింగ్ ఒకరు. జబర్దస్త్ షోలో సాయి తేజాగా పరిచయమై ట్రాన్స్ జెండర్ గా మారి ప్రియాంకా సింగ్ కొత్త అవతారం ఎత్తింది. పలు షోలు చేసుకుంటూ వచ్చిన ఆమె బిగ్ బాస్ సీజన్ 5తో మంచి గుర్తింపు వచ్చింది. సీజన్ 5లో దాదాపు చివరి రెండు వారాలు తప్ప షో అంతా ఆమె ఉందని చెప్పొచ్చు. మానస్ తో అమ్మడు కలిపిన పులిహోర బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఇదిలాఉంటే బయటకు వచ్చిన ప్రియాంకా సింగ్ కు ఆఫర్లు వస్తున్నట్టు టాక్.
ఒకటి రెండు ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్ లో ఉండగా లేటెస్ట్ గా టాలీవుడ్ రైటర్ కం ప్రొడ్యూసర్ కోనా వెంకట్ తో ప్రియాంకా సింగ్ లేటెస్ట్ మీటింగ్ టాలీవుడ్ లో హాట్ న్యూస్ గా మారింది. కోనా వెంకట్ ని కలిసిన ప్రియాంకా సింగ్ ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఎక్సైటెడ్ వన్ తో వస్తున్నాను అంటూ కామెంట్ పెట్టింది. ఈ లెక్కన ప్రియాంకా సింగ్ తో కోనా వెంకట్ ఓ ప్రయోగాన్ని చేస్తున్నారని అర్ధమవుతుంది. ప్రియాంక సింగ్ కి అలాంటి ఓ ఛాన్స్ వస్తే మాత్రం ఇక అమ్మడికి తిరుగు ఉండదని చెప్పొచ్చు.
బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో వరుస ఛాన్సులు అందుకుంటున్న ప్రియాంకా సింగ్ ఇక మీదట రెచ్చిపోవడం పక్కా అని తెలుస్తుంది. కోనా వెంకట్ తో చేసేది సినిమానా లేక వెబ్ సీరీస్ కోసమే వాళ్లు కలిశారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కోనా వెంకట్ చేతిలో పడుతుంది అంటే ప్రియాంకా సింగ్ ఫేట్ మారినట్టే అని చెప్పుకుంటున్నారు సినీ వర్గాల వారు. మరి ప్రియాంకా సింగ్ అంత ఎక్సయిటెడ్ గా ఫీల్ అయ్యేలా ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: