కృతి శెట్టి ఖాతాలో మరో హిట్టు బొమ్మ..!

shami
ఉప్పెన భామ కృతి శెట్టి మొదటి సినిమాతో మొదలు పెట్టిన విజయ పరంపర మూడవ సినిమా వరకు కొనసాగిస్తుంది. ఉప్పెన, శ్యాం సింగ రాయ్, బంగార్రాజు మూడు సినిమాలు సెసేషనల్ హిట్ అవడంతో కృతి శెట్టి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఈ క్రమంలో కృతి శెట్టి తన రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని తెలుస్తుంది.
హ్యాట్రిక్ హిట్ జోష్ లో ఉన్న అమ్మడు ఇప్పుడు మరో క్రేజీ మూవీ ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమాతో వస్తుంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ మూవీకి సంబందించిన టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది. ఆల్రెడీ సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాబినేషన్ లో సమ్మోహనం సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఆ కాంబినేషన్ లో వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ వస్తుంది. ఈ సినిమా టీజర్ చూస్తుంటే కృతి శెట్టి ఖాతాలో మరో హిట్ పడటం పక్కా అనిపిస్తుంది.
డైరక్టర్ గా సుధీర్ బాబు.. డాక్టర్ గా కృతి శెట్టిల క్యూట్ లవ్ స్టోరీ తో ఈ మూవీ వస్తుంది. సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల మనసులు గెలిచే మోహనకృష్ణ ఇంద్రగంటి తప్పకుండా ఈ సినిమాతో సుధీర్ బాబుకి మరో హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు. సినిమా టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించింది కృతి శెట్టి లుక్స్ కూడా అదిరిపోయాయి. సుధీర్ బాబు సినిమా తర్వాత రాం హీరోగా ది వారియర్, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో కృతి శెట్టి నటిస్తుంది. కృతి శెట్టి ఫాం చూస్తుంటే అమ్మడు మరో ఐదేళ్లు ఇదే బీభత్సం సృష్టించేలా ఉంది. కృతి శెట్టి సినిమాల సెలక్షన్స్ విషయంలో కూడా తన మార్క్ చూపిస్తుంది. అందుకే అమ్మడు వరుస హిట్లు కొడుతుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: