సుధీర్ బాబు - కృతి శెట్టి.. ఆ టీజర్ వచ్చేసింది?

praveen
మహేష్ బాబు బావగా తెలుగు చిత్ర పరిశ్రమలో కి ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు సుధీర్ బాబు. ఘట్టమనేని బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ఎప్పటికప్పుడు తనని తాను హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా ఘట్టమనేని ఫ్యామిలీ కి అస్సలు సంబంధం లేని డాన్సులు ఇరగ దీస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఫిట్నెస్ కి  ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రస్తుతం తన ఫిట్నెస్తో ఎంతోమందిలో  స్ఫూర్తిని నింపుతున్నాడు. అంతేకాదు కథల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు.

 ఇలా ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న హీరోగా మారిపోయాడు సుధీర్ బాబు. ఈ హీరో ఏ సినిమాలో నటించిన ఆ సినిమాలో కథ బలంగా ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతూ ఉన్నారు. అంతలా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు సుధీర్బాబు. ఇక పోతే తన హిట్ డైరెక్టర్ అయిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో మరోసారి సినిమా చేస్తున్నాడు సుధీర్ బాబు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సమ్మోహనం అనే సినిమా వచ్చి మంచి క్లాసికల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే దర్శకుడితో మరో సినిమాకు సిద్దమయ్యాడు. ' ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అని డిఫరెంట్ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 ఇక ఇటీవల కాలంలో అందరి మదిని దోచేసిన కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్  ఎలా ఉండబోతుందో అని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా టీజర్ విడుదల అయింది. ఇందులో సుధీర్ బాబు పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి డాక్టర్ పాత్రలో నటించబోతోంది. సినిమాల మీద పిచ్చి ఉండే ఒక యువకుడి పాత్రలో సుధీర్ బాబు ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్ చూసిన తర్వాత మరోసారి ఇంద్రగంటి మోహనకృష్ణ సుధీర్ బాబు కాంబినేషన్లో మరో క్లాసికల్ హిట్ రాబోతుంది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: