వెంకీ డబల్ హ్యాట్రిక్.. హిట్ కొట్టడమే ఆలస్యం!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో హిట్ కొట్టడం గగనమైపోయింది. మన హీరోలకు ఒక సినిమా హిట్ కొడితే రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అందుకోవడం అలవాటైపోయింది. దాంతో కొంతమంది హీరోలు మంచి కన్సెప్ట్ లను తెచ్చుకుని సినిమాలు చేసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయినా కూడా వారు ఈ ఫ్లాప్ నుంచి తప్పించుకోలేక పోతున్నారు కొంతమంది. అయితే హిట్ అనేది అందని ద్రాక్షగా కొంతమంది హీరోలకు హిట్ అనేది వారికి ఎప్పుడూ ఉండనే ఉంది. అయితే ఏ హీరోకి సాధ్యం కాని విధంగా విక్టరీ వెంకటేష్ తన ఇంటి పేరు లాగానే వరుస విజయాలు అందుకుంటూ పోతున్నాడు.

ఆయన హీరోగా చేసిన గత ఐదు చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి అని చెప్పవచ్చు. అంతేకాదు భారీ వసూళ్లను కూడా సదరు నిర్మాతలకు తెచ్చిపెట్టాయి. ఆయన గత రెండు చిత్రాలు  ఓ టీ టీ లో విడుదలైన కూడా అవి కూడా నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించాయి అని చెప్పవచ్చు.ఆ సినిమాకి కూడా పాజిటివ్ రావడంతో వెంకటేష్ విజయ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ఎఫ్ 3. ఇది కనుక మంచి విజయం సాధిస్తే ఆయన డబుల్ హ్యాట్రిక్ రికార్డును అందుకోబోతున్నారు. ఈ రోజుల్లో ఒకటి రెండు హిట్ లు రావడమే గగనం అయిపోతున్న నేపథ్యంలో డబుల్ హాట్రిక్ అందుకోవడం నిజంగా వెంకీ సినిమా ఎంపిక కు నిదర్శనం అని చెప్పాలి.

అనిల్ రావిపూడి దర్శకత్వం లో వరుణ్ తేజ్ మరియు వెంకటేష్ హీరోగా నటించిన ఎఫ్ 2 చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని డిమాండ్ ఏర్పడింది. దాంతో అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా చేయగా ఇది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విజయం సాధిస్తే డబల్ హ్యాట్రిక్ విజయం సాధించినట్లు అవుతుందని విక్టరీ వెంకటేష్ అభిమానులు చెబుతున్నారు. మరి సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న వ్యక్తి వెంకటేష్ ఈ చిత్రంతో ఎంతటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: