అందగాడైన హీరో ఎక్కడ ఉన్నాడో తెలుసా

D.V.Aravind Chowdary
భారత చలన చిత్ర పరిశ్రమలో ఉన్నఅగ్ర స్థాయి నట కుటుంబాల్లో నందమూరి కుటుంబం గురించి చెప్పాలంటే ఎంత చెప్పిన సరిపోదు . భారత దేశ సినీ , రాజకీయ రంగాలను ప్రభావితం చేసిన ఘనత వీరి సొంతం. అలాంటి కుటుంబం నుంచి  ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి చాలా బాగా రాణిస్తున్నారు . ఈ కుటుంబానికి చెందిన సీనియర్ ఎన్టీఆర్ ,బాలకృష్ణ ,జూనియర్ ఎన్టీఆర్ లు  స్టార్ హీరోలుగా  తెలుగు ఇండస్ట్రీ లో నిలిచారు. ఈ కుటుంబం నుండి వచ్చిన ప్రతి  హీరో మంచి గుర్తింపు అందుకున్నారు. అలాంటిది ఈ కుటుంబం నుండి వచ్చిన ప్రతి ఆ హీరో గురించి ఇప్పటి తరానికి చెందిన చాలా మందికి తెలియదు. పలు  సినిమాల్లో నటిస్తున్న ఆయన ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయ్యారు.


1980 వ దశకం లో  నందమూరి బాలకృష్ణ తో పాటు.. అదే జనరేషన్ లో ఆ ఫ్యామిలీ నుంచి ఒక హీరో వెండి తెరపై అడుగు పెట్టాడు. తన నటనతో తనకంటూ ఒక ఫేమ్ ను
సంపాదించుకున్నాడు.. హఠాత్తుగా సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. ఇంతకీ ఆయన ఎవరంటే. 

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు , మాజీ ముఖ్య మంత్రి సీనియర్  ఎన్టీఆర్ తమ్ముడైన త్రివిక్రమరావు కొడుకు కళ్యాణ్ చక్రవర్తి. 1986లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన స్వాగతం చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.  తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకోగా అదే ఏడాదిలో వరుసగా రెండు సినిమాల్లో నటించారు.  అక్షింతలు, తలంబ్రాలు, ఇంటి దొంగ, దొంగ కాపురం, మేనమామ లాంటి ఫ్యామిలీ మూవీస్ లో నటించి కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు  .


నటునిగా మా పెదనాన్న ఎన్టీఆర్  గారంత కావాలి.ఆ రోజే  నేను అనుకున్నది సాధించినట్లు అని కళ్యాణ్ చక్రవర్తి ఆ రోజుల్లో పలు సినీ మ్యాగజైన్స్ కిచ్చిన   ఇంటర్వ్యూలలో చెప్పేవారు .అయితే చిరంజీవితో  ‘లంకేశ్వరుడు’, శోభన్ బాబుతో ‘అగ్నినక్షత్రం’వంటి చిత్రాల్లో నటించిన  సినీ రంగం నుంచి హఠాత్తుగా దూరం అయ్యారు.


అందుకు కారణం  ఓ రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్  తమ్ముడు హరీన్ చక్రవర్తి , కొడుకు పృథ్వి ప్రాణాలు కోల్పోయారు. అదే యాక్సిడెంట్ లో కళ్యాణ్ చక్రవర్తి తండ్రి త్రివిక్రమరావు గాయాలతో బయటపడ్డారు. ఆ యాక్సిడెంట్ కల్యాణ్ కు  పెద్ద షాక్. అందులో నుంచి ఆయన తేరుకోక పోయాడు. దీంతో నటనకు గుడ్ బై చెప్పి.గాయపడిన తండ్రి కి మరణించే వరకు తానే  స్వయంగా దగ్గరుండి  సేవ చేస్తూ వచ్చారు .


తండ్రి మరణించిన అనంతరం సైతం  తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై  నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చినా  కళ్యాణ్ చక్రవర్తి చెన్నైని వదిలి పెట్టలేదు. అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోయారు. కళ్యాణ్ భార్య ప్రముఖ రవాణా సంస్థ ఎస్. ఆర్. ఏం. టి సంస్థ  అధినేత కె. వి. ఆర్. చౌదరి మనవరాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: