పవన్ హరిహర వీరమల్లు కు బడ్జెట్ ప్రాబ్లమ్..!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో అనౌన్స్ చేసిన సినిమాలు కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోతున్నాయి. నిర్మాతకు అవగాహన లోపం వల్ల బడ్జెట్ లు అమాంతం పెరిగిపోవడం తో మధ్య లోనే కొన్ని సినిమాలు ఆగిపోతున్నాయి. పెద్ద హీరోల సినిమాలు సైతం దీనికి అతీతం ఏమీ కావట్లేదు. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క పెద్ద హీరో కూడా ఏదో ఒక సమయంలో కొన్ని సినిమాలను మధ్యలోనే ఆపుకోవాల్సి వచ్చింది. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమా ఇప్పుడు ఆగిపోయే ప్రమాదం లో ఉందన్న వార్తలు సోషల్ మీడియా లో ఎక్కువ అవుతున్నాయి.

పవన్ అభిమానులు ఎంత ఖండిస్తున్నా కూడా రోజు రోజుకు ఈ సినిమా బృందం ఏమి స్పందించకపోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఓ చారిత్రాత్మక సినిమాలో నటిస్తున్నాడు అనగానే అందరూ ఎంతో సంతోష్ పడ్డారు. అలా హరి హర వీరమల్లు చిత్రం క్రిష్ దర్శకత్వం లో భారీ స్థాయి లో తెరకెక్కుతు ఉండగా  ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నాడు.  టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను చేసి నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ నిర్మాతకు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఆశ్చర్యం అనే చెప్పాలి.

ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ ఈ సినిమా బడ్జెట్ ముందు అనుకున్న దానికంటే ఎక్కువగా పెరిగిపోయిందని దానితో ఆయన చేతులు ఎత్తేసే పరిస్థితి లో ఉన్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఆదుకోవడానికి ఎవరు ముందుకు వస్తారో చూడాలి. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. 150 కోట్లకు పైగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పవన్ కళ్యాణ్ 27 వ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: