శేఖర్ కమ్ములతో తో సినిమా చేస్తే ఆ హీరోకి విడాకులేగా..!

murali krishna
వెంకీ పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదేనెమో పాపం ఎవరో విడాకులు తీసుకుంటే ఆ నేరం దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekar Kammula) మెడకు చుట్టుకుందిగా.రెండు పచ్చని జంటలను విడదీసిన నేరం పాపం ఆయనదే అంటూ సోషల్ మీడియా మీమ్ రాజాలు రెచ్చిపోతున్నారు. ఇది కోఇన్సిడెంట్ కాదు దీని వెనుక లాజిక్ మరియు సెంటిమెంట్ ఉందంటున్నారు.
 
శేఖర్ కమ్ముల తన కెరీర్ లో దాదాపు పెళ్లి కాని హీరోలతోనే ఎక్కువ సినిమాలు చేశారు. పెళ్ళైన హీరోలతో పనిచేసిన ప్రతిసారి సదరు హీరోలు తమ భార్యలకు విడాకులు ఇచ్చేశారట.. డాలర్ డ్రీమ్స్ అనే చిత్రంతో డైరెక్టర్ గా మారిన శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాతో డైరెక్టర్ గా వెలుగులోకి వచ్చాడని తెలుస్తుంది.తర్వాత హీరో సుమంత్ (Sumantha)తో 'గోదావరి' చిత్రం చేశారు ఆయన. గోదావరి మూవీ 2006లో విడుదల కాగా అదే ఏడాది సుమంత్ భార్య కీర్తి రెడ్డితో విడాకులు తీసుకున్నారట.. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2006లో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు..
 
ఆ తర్వాత శేఖర్ కమ్ముల చేసిన చిత్రాల్లో ఒక్క పెళ్ళైన హీరో కూడా నటించలేదట.. దాదాపు 15ఏళ్ల తర్వాత మరో మారీడ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya)తో ఆయన లవ్ స్టోరీ మూవీ చేశారని తెలుస్తుంది.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సమంతతో ఆయనకు మనస్పర్థలు కూడా తలెత్తాయి. ఇద్దరినీ కలపాలని పెద్దవాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ససేమిరా అంటూ విడాకులు తీసుకున్నారు.కాగా నిన్న హీరో ధనుష్ (Dhanush)భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్లు చెప్పి అందరికి బాంబు పేల్చాడు. 18 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ధ్రువీకరించారట.. చట్టబద్ధంగా విడిపోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ఆయన తెలియజేశాడు. ఈ న్యూస్ అందరినీ కూడా భారీ షాక్ కి గురిచేసింది.
 
ఈ పరిణామం నెటిజెన్స్ లో కొత్త థీరీకి తెరలేపిందట.మీమ్స్ మరియు ట్రోల్స్ రాజాలు వెంటనే కొన్ని లాజిక్స్ తో మీమ్స్ సిద్ధం చేశారని తెలుస్తుంది.వాళ్ళ లెక్కలో నాగ చైతన్య మరియు ధనుష్ విడాకుల బాధ్యత పూర్తిగా శేఖర్ కమ్ములదేనట. ఆయనతో సినిమా చేయడం వలెనే ఆ ఇద్దరు హీరోలకు తమ భార్యలతో గొడవలు తలెత్తాయని ఇది సెంటిమెంట్ కావచ్చు, లేదంటే కోఇన్సిడెంట్ కావచ్చు  శేఖర్ కమ్ముల కారణంగానే సమంత(Samantha)తో నాగ చైతన్య, ధనుష్ తో ఐశ్వర్య విడిపోయారని తెగ ఆడుకుంటున్నారు.. సుమంత్ విడాకులతో కూడా కొంచెం అటూ ఇటుగా శేఖర్ కమ్ముల ప్రమేయం కూడా కనిపిస్తుంది. దీంతో సంకోచం లేకుండా శేఖర్ కమ్ములపై ట్రోల్ల్స్ మరియు మీమ్స్ తో మీమర్స్ విరుచుకుపడుతున్నారు.
ఇదంతా గమనిస్తున్న సోషల్ మీడియా జనాలు ఇదేం లాజిక్ రా నాయన ఆయన పాటికి ఆయన సినిమాలు చేసుకుంటుంటే.. విడాకుల గొడవల్లోకి శేఖర్ ని లాగడం ఏంటని అడుగుతున్నారట.. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: