‘మన్మథుడు’కు పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితేంటో తెలుసా..?

N.ANJI
మన్మథుడు సినిమా గుర్తే ఉండుంటుంది. డైరెక్టర్ కే.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో నాగార్జున టాలీవుడ్‌ ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరోగా, మన్మథుడిగా మారిపోయారు. 2002 డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ అయిన ఈ క్లాసిక్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమాలో నాగార్జున నటనతోపాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టాయి.
మన్మథుడు సినిమాలో హీరోయిన్లుగా ‘సోనాలి బిండ్రే, అన్షు’ నటించారు. ఇద్దరి పాత్రలు ఎంతో అద్భుతంగా చూపించారు దర్శకుడు కే.విజయ్ భాస్కర్. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికీ విన్నా.. మీరు వింటూనే ఉంటారు. అప్పట్లోనే ఈ సినిమా దాదాపు రూ.10 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. 20 సెంటర్లలో 100 రోజులపాటు సినిమా హౌజ్‌ఫుల్‌గా నడిచింది. మన్మథుడు సినిమా ఇప్పుడు బుల్లితెర మీద వస్తుందంటే చాలు.. ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా సినిమాను తిలకిస్తుంటారు.
మన్మథుడు సినిమా కంటే రెండు వారాల ముందు రిలీజ్ అయిన ‘తొట్టి గ్యాంగ్’ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో ‘అల్లరి నరేష్, సునీల్, ప్రభుదేవా’ నటించారు. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ హిట్ అందుకుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా.. ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. 
అదే రోజు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘త్రినేత్రం’ సినిమా ఊహించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. ఇందులో కేఆర్ విజయ్, రాశీ, సింధు మీనమ్ నటించారు.

ఈ తర్వాత డిసెంబర్ 13వ తేదీన ‘సందడే సందడి’ సినిమా రిలీజ్ అయింది. ఇందులో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, శివాజీ నటించారు. డైరెక్టర్ ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కించారు. ‘ప్రేమలో పావనీ కళ్యాణి, కూలీ, నిను చూడక నేనుండలేను, అన్వేషణ’ సినిమాలు డిసెంబర్‌లో రిలీజ్ అయినా.. ఊహించిన స్థాయిలో ప్రేక్షకుల మెప్పించలేకపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: