సమంత గురించి హాట్ కామెంట్స్ చేసిన రకుల్..!!

Divya
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప.. ఇకపోతే పాన్ ఇండియా ప్రయత్నం చేసిన సుకుమార్ మంచి ఫలితాన్ని అందుకున్నాడు. ఇకపోతే హిందీ లో పుష్ప సినిమా భారీ వసూళ్లను రాబట్టి నార్త్ ఇండియాలో సూపర్ హిట్ ఫిలిం గా రికార్డు సృష్టించింది.. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా మొరటు యాటిట్యూడ్, నటన యాక్షన్ అంశాలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ఇక సినిమా థియేటర్ లలో ఒక రేంజ్ లో విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం ఓటీటీ లో కూడా విడుదలయి సెలబ్రిటీలను సైతం ఆకర్షిస్తోంది. ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసిన తర్వాత ప్రశంసలు కురిపించడం గమనార్హం..
ఇకపోతే తాజాగా మరొక స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ పుష్ప చిత్రాన్ని చూసి ప్రశంశల వర్షం కురిపిస్తూ ట్వీట్  కూడా చేసింది.. ఇక అల్లు అర్జున్ ,సుకుమార్, రష్మిక మందన్న, సమంతలపై ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం.. ఆమె ట్విట్టర్ ద్వారా ఇలా రాసుకొచ్చింది..'పుష్ప.. ఉఫ్... విజిల్ కొట్టించే నీ స్టైల్,నీ  క్రేజ్.. నా ఫేవరిట్ అల్లు అర్జున్ యొక్క బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్.. ఇలాంటి పాత్రలు నువ్వు మరెన్నో చేయాలి. సుకుమార్ సర్ ప్రతి సారి  ఒక కొత్త ప్రపంచం సృష్టిస్తారు. రష్మిక చాలా అద్భుతంగా  నటించింది .అందంగా కూడా  కనిపించింది. 
ఇక సమంత.. ఆమె గురించి ఏం చెప్పను నేను .. సమంత హాట్ నెస్  అయితే నెక్స్ట్ లెవల్ లో ఉంది. ఫహద్ ఫాజిల్  చాలా ఇంటెన్స్ గా నటించారు. పుష్ప చిత్ర యూనిట్ మొత్తానికి నా  శుభాకాంక్షలు అంటూ రకుల్ పోస్ట్ పెట్టింది. రకుల్,  అల్లు అర్జున్ సరసన సరైనోడు చిత్రంలో నటించిన సంగతి మనకు  తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: