అక్కడ చంద్రానికి నో ఎంట్రీ బోర్డ్..!

shami
ఈటీవీ జబర్దస్త్ లో ఫ్యామిలీ స్కిట్స్ వేస్తూ కడుపుబ్బా నవ్వించిన చమ్మక్ చంద్ర జబర్దస్త్ లో దాదాపు ఐదారేళ్లుగా పనిచేశాడు. అయితే జబర్దస్త్ నుండి మెగా బ్రదర్ నాగబాబు బయటకు వచ్చి ఆయనతో పాటుగా కొందరు టీం లీడర్స్ ని కూడా జీ తెలుగుకి తెచ్చాడు. ముందు వచ్చింది జబర్దస్త్ డైరక్టర్స్ కాగా.. నాగబాబు ఎగ్జిట్ అయ్యాడని చమ్మక్ చంద్ర, ఆర్పీ లాంటి వారు జబర్దస్త్ ని వదిలేశారు. జీ తెలుగులో బొమ్మ అదిరింది షో చేశారు. అయితే ఆ షో వల్ల పెద్దగా లాభం లేకుండాపోవడంతో మధ్యలోనే ఆపేశారు.
జీ తెలుగు నుండి వీళ్ల గ్యాంగ్ స్టార్ మాకి మారింది. కామెడీ స్టార్స్ అంటూ ఓ షోతో నవ్విస్తున్నారు. చమ్మక్ చంద్ర ఇందులో స్కిట్స్ చేస్తున్నారు. ఈమధ్య నాగబాబు కూడా కామెడీ స్టార్స్ కి ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ జడ్జ్.. జబర్దస్త్ కంటెస్టంట్స్ ఛానెల్ వేరే కాని మిగతాది అంతా ఒకటే. ఇక ఇదిలాఉంటే స్టార్ మాలో కామెడీ స్టార్స్ కి పెద్దగా రేటింగ్ రావట్లేదు. ఇది మళ్లీ చూడాలంటే డిస్నీ హాట్ స్టార్ లోనే తప్ప యూట్యూబ్ లో రాదు. ఇలా ప్రేక్షకాదరణకి కామెడీ స్టార్స్ దూరమవుతుంది.
ఈ క్రమంలో చమ్మక్ చంద్ర మళ్లీ కామెడీ స్టార్స్ కు గుడ్ బై చెప్పేశాడని టాక్. మళ్లీ అతను జబర్దస్త్ లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడట. అయితే మల్లెమాల మాత్రం చంద్రాన్ని తీసుకోవడానికి వెనకాడుతున్నారని టాక్. అయితే చంద్రం వల్ల ఫ్యామిలీ స్కిట్స్ బాగా వర్క్ అవుట్ అవుతాయన్న కారణంతో అతన్ని తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి చమ్మక్ చంద్ర జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇస్తాడా లేక కామెడీ స్టార్స్ లోనే కొనసాగుతాడా అన్నది చూడాలి. చంద్ర మాత్రం ఈసరి జబర్దస్త్ ఛాన్స్ వస్తే మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకోవాలని చూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: