రౌడీ బాయ్స్ నుంచి ఆకట్టుకుంటున్న సాంగ్..

Satvika
ఆశిష్ హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో … శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం 'రౌడీ బాయ్స్'.. తెలుగు ప్రేక్షకుల మనసును దొచుకున్న నిర్మాత దిల్ రాజు, శిరీష్ ల కుటుంబం నుంచి ఇప్పుడు కొత్త హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు.. హుషారు' ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా 'రౌడీ బాయ్స్' మూవీ తెరకెక్కింది.

ఈ సినిమాలొ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు అన్నీ కార్యక్రమాల ను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని తెలుస్తుంది.ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టిన రౌడీ బాయ్స్ టీం సోమవారం ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేసింది. 'బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే' అనే పాట లిటికల్ వీడియోలో.. అనుపమ పరమేశ్వరన్‌ డ్యాన్స్‌ అందరినీ ఆకర్షించింది..

సాంగ్ కు అమ్మడు కాలు కదిపిన స్టైల్ యూత్ ను ముఖ్యంగా ఆకర్షించింది. సుద్దాల అశోక్‌ లిరిక్స్‌ అందించగా, మంగ్లీ తన వాయిస్‌తో మరోసారి ఆకట్టుకుంది. హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. . దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కార్తిక్‌ రత్నం, తేజ కూరపాటి, కోమలి ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విడుదల తెదీని త్వరలోనే తెలుపుతున్నట్లు చిత్రబృందం చెప్పారు. ప్రస్తుతం ఆ పాట కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలొ ట్రెండ్ అవుతుంది.. మీరు కూడా ఒకసారి ఆ పాటను చూడండి.. అనుపమ ఎంత బాగా డ్యాన్స్ చేసిందో..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: