మాజీ ప్రియుడికి మర్చిపోలేని కానుక..కత్రినా టేస్టే వేరబ్బా..?

VUYYURU SUBHASH
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి అందరికి తెలిసిన విషయమే. ఎవరైన సహాయం కావాలి అని ఇంటికి వెళ్లితే కాదు అనకుండా చేస్తాడు. అంతేకాదు తన దృష్టికి వచ్చిన ఏ సమస్యను అయినా ఇట్టే తనదైన స్టైల్లో తీర్చేస్తాడు. అందుకే కాబోలు బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా బడా స్టార్ అయిన పెద్ద హీరోలు చాలా మందే ఉన్నా కానీ అందరు సల్మాన్ ను ఇష్టపడతారు. ఈయన సినిమాలల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడే హీరోనే. అలా ప్రూవ్ చేసుకున్న సంధర్భాలు చాలానే ఉన్నాయి.
ఇక రీసెంట్ గానే సల్మాన్ తన 56వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సంధర్భంగా  సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక మహిళా అభిమానులు అయితే ఆయన సంతోషంగా ఉండాలంటూ పూజలు కూడా చేసారు. ఇలాంటి అభిమానం కొందరికే దక్కుతుంది..అలాంటి వారిలో సల్మాన్ కూడా ఉండడం సంతోషించ తగ్గ విషయమే. ఇక బాలీవుడ్ బడా స్టార్స్ కూడా సల్మాన్ ఖాన్ కు బాగా కాస్ట్లీ గిఫ్ట్లు పంపారట. కానీ అందులో ప్రత్యేక ఆకర్షణగా  నిలిచింది బాలీవుడ్ బ్యూటీ..సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ బహుమతి.
ఇంతకి  కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ కోసం ఏం పంపించిందో తెలుసా.. 5 లక్షలు విలువ  చేసే ఓ గోల్డ్  బ్రాస్ లెట్  ను స్పెషల్ గా డిజైన్ చేసి పంపించారట. దీంతో నెట్టింట ఈ వార్త మారుమ్రోగిపోతుంది. నిజానికి వీళ్లిద్దరు ఎప్పటినుండో మంచి స్నేహితులు గా ఉన్నారు. ఇద్దరు కూడా బాలీవుడ్‌లోని టాప్ స్టార్ల లిస్ట్ లో ఉంటారు. వీళ్ళ మధ్య బాండింగ్ చూసి  ఒకానొక సమయంలో వీరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి కానీ సీన్ కట్ చేస్తే సల్మాన్ సింగిల్ గా ఉన్నా ..కత్రినా భర్తతో మింగిల్ అయిపోయింది. రీసెంట్ గానే కత్రినా  బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: