హీరోలకు ధీటుగా సుకుమార్ సినిమాలు!!

P.Nishanth Kumar
హీరో లు సినిమాల విషయంలో ఎంతో ఫాస్ట్ గా ఉండడం మనం చూస్తున్నాం.. వారు ఒక సినిమా ను పూర్తి చేయకముందే మరిన్ని సినిమాలను చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అలా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అందరు హీరో లు కూడా ఒక్కొక్కరు నాలుగు సినిమాలను సెట్స్ పైన ఉంచారు. సీనియర్ హీరోలు , యంగ్ హీరో లు , స్టార్ హీరో లు అనే తేడా లేకుండా అందరు హీరోలు కూడా రెండు కు పైగానే సినిమాలను సెట్స్ పైన ఉంచుకున్నారు. అయితే దర్శకులు మాత్రం ఒక్క సినిమా తోనే నెగ్గుకురావడం మనం చూస్తున్నాం..

హీరో లు సినిమాల పట్ల ఎంత కేరింగ్ గా ఉన్నా కూడా దర్శకుడు కెప్టెన్ కాబట్టి అన్ని విషయాలు చూసుకోవాలి కాబట్టి ఒక్కసారి ఒక్క సినిమా ను మాత్రమే చేయాల్సి వస్తుంది. ఇంకో సినిమా ను చేయాలంటే చాలా ఓపిక అవసరం ఉంటుంది. ఒక సినిమా ను పూర్తి చేసి సరైన సమయానికి విడుదల చేయడానికే దర్శకులకు తల ప్రాణం తోకకి వస్తుంది. ఈ నేపథ్యంలో వారు రెండు సినిమాలు చేయడం అనేది గగనం అనే చెప్పాలి. కానీ దీనికి భిన్నంగా సుకుమార్ తాను వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లడం ఇప్పుడు అందరి దర్శకులకు ఎంతగానో ఆశ్చర్యం కనిపిస్తుంది. 

ప్రస్తుతం పుష్ప సినిమా రెండవ భాగాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న సుకుమార్ ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రాగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా సుకుమార్ ఆలోచనలు చేస్తున్నారు. ఇకపోతే సుకుమార్ రామ్ చరణ్ హీరోగా కూడా మరో చిత్రాన్ని చేయబోతున్నట్లు ఇటీవలే క్లారిటీ వచ్చింది. రాజమౌళి ఈ విషయాన్ని అధికారికంగా చెప్పాడు. రంగస్థలం తర్వాత వీరి కాంబో లో మరో సినిమా రావడం విశేషం. ఒకేసారి మూడు సినిమాలను తన బుర్రలో మెదిలిస్తూ సుకుమార్ భారీ సాహసమే చేస్తున్నాడు అని చెప్పవచ్చు. ఏ దర్శకుడికి సాధ్యం కాని విధంగా ఆయన ఇలా చేయడం నిజం గొప్ప విషయమే అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: