హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2021: ఈ ఏడాది ట్రోలింగ్ కి గురైన హీరోయిన్..!!

Divya
ఈ ఏడాది చాలామంది రకరకాలుగా వివాదాలలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా లోఫర్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దిశా పటాని కూడా ఈ ఏడాది తీవ్రంగా ట్రోలింగ్ కి గురి అయింది. ఇకపోతే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈమె హిందీలో తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాల ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది..ఈమె నటించిన ఎంఎస్ ధోని, బాఘి 2 వంటి సినిమాలకు అవార్డులు కూడా లభించడం గమనార్హం.
ఒకవైపు ఈమె సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషిస్తూనే ఇంకోవైపు దిశాపటాని అభినయ పాత్రలు కూడా చేసి విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇకపోతే ఈ హీరోయిన్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది. ఇకపోతే ఇప్పటికే గ్లామరస్ రోల్స్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తన డ్రెస్సింగ్ విషయంలో నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో ట్రోల్ కి గురవుతోంది.. ఇకపోతే ఈమె బ్రౌన్ టాప్, బ్లూ జీన్స్ లో ఉన్న ఫోటోను ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ లో ఒకరైన మానవ మంగళ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో ఆమె డ్రెస్సింగ్ సెన్స్ ను చూసి నెటిజన్లు పోకిరి లాగా ఉన్నావ్ అంటూ ఆమెను రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే అడుక్కునే వాళ్ళు కూడా ఈ విధంగా బట్టలు వేసుకోరు అంటూ రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక పోతే ఇంకొక నెటిజన్ ఏమన్నారంటే ఇలా చిరిగిన బట్టలను వేసుకుంటున్నారు.. ఇక నా దేశానికి ఏమైంది.. ఎంత పేదవాళ్ళు అంటూ ఒకరు కామెంట్ పెట్టాడు. అంతేకాదు ఈమె స్కిన్ టోన్ గురించి కూడా కొంతమంది నెటిజనులు, నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈమెకు ఎక్కువగా ఆఫర్లు వస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: