ఆ కారణం వల్లే నభా నటేష్ కు సినిమా అవకాశాలు రావడం లేదా..?

Pulgam Srinivas
హాట్ బ్యూటీ నభా నటేష్, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ కు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ ఈ హాట్ బ్యూటీ అందచందాలకు,  నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులే పడడంతో నభా నటేష్ కు తెలుగు ఇండస్ట్రీ లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హాట్ బ్యూటీ నభా నటేష్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

  ఇలా ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో, నభా నటేష్ కు కూడా తెలుగులో ఫుల్ క్రేజ్ దక్కింది,  అందులో భాగంగా సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో వంటి సినిమాల్లో నటించి మెప్పించింది, అయితే ఇలా అతి తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో టాలీవుడ్ లో ఫుల్ గా తన హవాను చూపిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాత్రం చాలా వరకు సైలెంట్ అయిపోయింది,  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఆఫర్లు కూడా ఏమీ పెద్దగా లేవు,  మరి అందం ఉండి, అభినయ నుండి, నటన ఉండి కూడా ఎందుకు నభా నటేష్  కు ఆఫర్లు రావడం లేదు అంటే చాలా మంది కొన్ని సినిమాలు విజయవంతం కావడం తో నే ఈ ముద్దుగుమ్మ భారీగా రెమ్యునిరేషన్  ను పెంచేసింది అని అందుకే ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి, మరి కొంత మంది మాత్రం నభా నటేష్ కు ఆఫర్లు లేక కాదు ఏదో పెద్ద లెవల్ లో ప్లాన్ చేస్తోంది అంటూ కూడా అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: