తరగని వయసు.. ఆగని అవకాశాలు.. వీరి సొంతం!!
టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ వయస్సు కూడా 30 సంవత్సరాలకు పైమాటే. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ప్రేక్షకులను కొన్ని సినిమాల ద్వారా అలరిస్తుంది. అంతేకాదు ఆమె వెబ్ సిరీస్ లో కూడా నటించడం మొదలు పెడుతుంది. ఆమె చిన్న నాటి స్నేహితుడు ని పెళ్లి చేసుకున్న కాజల్ ఇప్పుడు గర్భవతి అనే వార్తలు వస్తుండగా వాటికి నిజం చేస్తూ ఆమె పెద్దగా బయట ప్రపంచంలో కనపడటం లేదు. మరి కాజల్ బిడ్డను కన్న తర్వాత సినిమాలలో నటించి తన అభిమానులను మళ్లీ అంతటి స్థాయిలో అలరిస్తుందా అనేది చూడాలి.
ఇక మూడు పదుల వయస్సు దాటిన తర్వాత కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది అనుష్క. బాహుబలి సినిమా చేసే సమయానికి ఆమెకు 30 సంవత్సరాలు దాటి సాయి. ఇప్పుడు కూడా ఆమె సినిమాలను చేయడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. ఇంకా టాలీవుడ్ లో శ్రేయ శరణ్ సమంత వంటి వారు కూడా మూడు పదుల వయసు దాటిన వారే. ఇక బాలీవుడ్ లో కత్రినా కైఫ్ కరీనా కపూర్ రాణీముఖర్జీ విద్యాబాలన్ దీపికా పడుకునే వంటి హీరోయిన్లు మూడు పదుల వయసులోనూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు.