ప్రభాస్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్.. ఏంటో తెలుసా...?

Anilkumar
మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది. ఇక న్యూ ఇయర్ కు సంబంధించి వచ్చే సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి మూవీ అప్డేట్ ఇవ్వడానికి మన పాన్ ఇండియా హీరో ప్రభాస్ సిద్ధమయ్యాడు. ఒక విధంగా చూసుకుంటే ఇది టాలీవుడ్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ అప్డేట్ అని చెప్పాలి. ఇక డార్లింగ్ ఫాన్స్ అయితే ఇది మాస్ అప్ డేట్. అదేంటంటే ప్రభాస్ కొత్త సినిమా గురించి. అది కూడా బాలీవుడ్ సినిమా గురించిన అప్డేట్. హృతిక్ రోషన్, టైగర్ షరాఫ్ హీరోలుగా నటించిన 'వార్' సినిమా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడని గతకొన్ని రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ మధ్య కాలంలో ఈ వార్త వినిపించడం తగ్గడంతో ఇంతకీ ఈ ప్రాజెక్టు ఉంటుందా? అనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం 2022 జనవరి 1 తేదీన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ పెద్ద అనౌన్స్మెంట్ ఉండబోతుందట. అంతే కాదు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ గురించి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ తమిళంలో ఎంట్రీకి సిద్ధమైంది. అయితే బాలీవుడ్లో మాత్రం ఇంకా ఎటువంటి ప్రాజెక్ట్ ఓకే కాలేదు. అయితే బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణ బాధ్యతలను చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.

కొత్త సంవత్సరం సందర్భంగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తారట మేకర్స్. దీంతో ప్రభాస్ లిస్టులో మరో సినిమా కూడా చేరిపోయినట్లే అంటున్నారు. ఇప్పటికే సాహో సినిమా తో బాలీవుడ్ మార్కెట్ లో ఖాతా తెరిచి భారీ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న రాధేశ్యామ్ సినిమాతో మరోసారి బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాధాకృష్ణ డైరెక్షన్ లో రూపొందుతున్న  ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: