సుధీర్ టీం కు పెద్ద సినిమాలలో ఛాన్స్ వచ్చిందా...?

murali krishna
జబర్దస్త్  సీనియర్ హీరోయిన్ అయిన ప్రముఖ రాజకీయ నాయకురాలు అయినటువంటి రోజా వంటి ఎంతో పెద్ద స్టార్లకే జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన విషయం అందరకి తెలిసిందే. ఇప్పుడు వేణు మరియు ధనరాజ్ , తాగుబోతు రమేష్ అలాగే చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు ప్రస్తుతం సినిమాల్లో స్టార్ కమెడియన్ లుగా కొనసాగుతున్నారు అంటే అందుకు కారణం జబర్దస్త్ వేదిక అని తెలుస్తోంది..
ఇక వీరి తర్వాత యాంకర్ అనసూయ సినిమాలలో అంత మంచి మంచి అవకాశాలు కొట్టేయడానికి కారణం జబర్దస్త్ స్టేజ్ మీద ఆమె చేసే యాంకరింగ్ మాత్రమే కాదు తన సోయగాలతో కుర్రకారును మంత్రముగ్ధుల్ని చేస్తోంది కాబట్టి సినిమాలలో అవకాశాలు దక్కించుకుందట.
 
రష్మీ కూడా మొదట్లో సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తిరిగి జబర్దస్త్ వేదికమీద యాంకర్ గా పని చేయడం మొదలు పెట్టిందట. ఆ తర్వాత ఢీ డాన్స్ ప్రోగ్రాం లో టీం లీడర్ గా మెరిసిన రష్మి  మరియు సుడిగాలి సుధీర్ తో కలిసి బాగా పాపులారిటీని సంపాదించుకుందట.ఈ మధ్య రష్మీ కి కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటమ్ సాంగ్లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.. ఇలా ఎంతో మంది జబర్దస్త్ స్టేజి పైన మంచి పేరు సంపాదించుకున్న తర్వాత జబర్దస్త్ వదిలి సినిమా లోకి ప్రవేశిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ ,శ్రీను అలాగే రాంప్రసాద్ వంటి కమెడియన్లు జబర్దస్త్ కి గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తుంది.
 
జబర్దస్త్ స్టేజి పైన ఎంతో మంచి కమెడియన్ లుగా పేరు తెచ్చుకున్న వీరు ముగ్గురు జబర్దస్త్ ని వదిలి వెళ్ళిపోవడం తో ప్రతి ఒక్కరు అసహనం వ్యక్తం చేస్తున్నారట.. సుధీర్ కు మరియు శ్రీను కు సినిమాలలో నటించే అవకాశం రాగా రామ్ ప్రసాద్ కు రైటర్ గా పనిచేసే అవకాశం వచ్చిందని తెలుస్తుంది.. ఇకపోతే జబర్దస్త్ స్టేజ్ పైన నటించేవారు సినిమాలలోకి వెళ్ళాలి అంటే మల్లెమాల అగ్రిమెంట్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందట.. సినిమాలలో నటించే వారు జబర్దస్త్ పైన నటించకూడదు అనే నియమ నిబంధనలు కూడా ఉన్నాయట. అందుకే వీరు సినిమాలలో నటించడం కోసం వీరు ముగ్గురు జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనున్నట్లు తాజాగా విడుదలైన ఒక ప్రోమో లో పైన బహిరంగంగా చెప్పేశారట.. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: