జస్ట్ మిస్..పెను ప్రమాదం నుండి తప్పించుకున్న స్టార్ సెలబ్రిటీలు..!!

VUYYURU SUBHASH
జనరల్ గా ఎదైన రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితేనే మనం అయ్యో పాపం అనుకుంటాం. అలాంటిది మనకు బాగా తెలిసిన వాళ్లు యాక్సిడెంట్ అయిన వెహికల్ లో ఉంటే.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అయితే చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు కొద్దిపాటి గాయాలతో బయట పడచ్చు.. కానీ ఓ విమానం ల్యాండ్ అవ్వడానికి వీళు లేక రెక్కలు విరిగిపోయే పరిస్ధితి ఎదురైతే ..? ఆ విమానం లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది..?
సరిగ్గా 27 ఏళ్ల క్రితం ఇలా నే జరిగింది.  ఓ  ఫ్లైట్ యాక్సిడెంట్ లో మరణం అంచులు దాకా వెళ్లిన స్టార్ హీరోలు, హీరోయిన్ లు పెను ప్రమాదం నుండి తప్పించుకుని బయటపడ్డారు. ఈ భయంకరమైన సంఘటన జరిగింది 1993లో జరిగింది.  నవంబర్ 15 వ తేదీన ఉదయం 6 గంటలకు  చెన్నై ఎయిర్ పోర్ట్ నుండి 272 మంది ప్రయాణీకులతో ఓ విమానం హైదరాబాద్ కు  బయలుదేరింది. ఇక ఆ విమానంలో  తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో  చిరంజీవి, బాలకృష్ణ కుటుంబ సభ్యుల తో పాటు.. అల్లు రామలింగయ్య దంపతులు కూడా ఉన్నారు. అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, మాలాశ్రీ, కమెడియన్ సుధాకర్ తో పాటు బడా దర్శకులైన  బాపు, కోడిరామకృష్ణ, రచయితలు వెంకటేశ్వరరావు కూడా ఉన్నారట.  
కాగా, విమానంలో సాంకేతిక లోపం వల్ల ఫైట్ ల్యాండింగ్ కు కష్టమైంది. ఈ విషయం ప్యాసింజర్స్ కు తెలియడంతో ఒక్కసారిగా విమానంలో గందర గోల పరిస్ధితి ఏర్పడింది. ఫైట్ ల్యాండ్ అయ్యే పరిస్ధితి కనిపించడం లేదు.. పోనీ తిరిగి వెనక్కి వెళ్లిపోదాం అనుకుంటే.. విమానంలో తగ్గినంత ఇంధనం లేదు.. దీంతో ఏం చేయాలో దిక్కు తోచక అందరు అల్లాడిపోతున్న సమయంలో పైలెట్ చాకచక్యంగా పెను ప్రమాదం నుండి అందరిని బయటపడేసారు. కాక్ పిట్‌లో సీనియర్ పైలెట్ గా ఉన్న కెప్టెన్ భల్లా .. పరిస్ధితిని అదుపు చేయడానికి నెల్లూరు జిల్లా వెంకటగిరికి సమీపంలోని పోలాల్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో ఆ వేగానికి తట్టుకోలేక విమానం చాలా సేపు నేల మీదనే దూసుకుపోయింది. ఇక ఆ తరువాత మెల్లగా అందరిని సేఫ్ గా బయటకు రప్పించారు ఎయిర్ హోస్టర్స్. ఆ విధంగా చిరు , విజయశాంతి, వెంకీ లాంటి స్టార్ సెలబ్రిటిల తో పాటు పలువురు సామాన్యులు కూడా ఓ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: