లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూన్న లేడీ సూపర్ స్టార్..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ నయనతార రజనీకాంత్ హీరో గా తెరకెక్కిన చంద్రముఖి సినిమా తో తమిళ్ తో పాటు తెలుగు లోనూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాత సూర్య హీరో గా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన  గజిని సినిమాలో  ఒక ప్రత్యేక పాత్రలో కనిపించిన నయనతార ఈ సినిమాతో కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా కూడా తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి బ్లాక్ బస్టర్ విజయంగా నిలవడంతో నయనతార కు టాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. తెలుగు నాట ఈ ముద్దు గుమ్మకు క్రేజీ కూడా ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన నయనతార అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది.

అలా తెలుగు లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న నయనతార, ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ వైపు ఎక్కువ ఫోకస్ పెట్టింది. కోలీవుడ్ లో తన కంటే తక్కువ వయస్సు ఉన్న హీరోల సరసన కూడా నటించిన నయనతార తమిళ నాట క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం  తమిళ్ ఇండస్ట్రీ పై ఫుల్ ఫోకస్ పెట్టిన నయన తార అప్పుడప్పుడు కొన్నికొన్ని టాలీవుడ్ సినిమా లలో కూడా కనిపిస్తూ ప్రేక్షకులని మెప్పిస్తుంది. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం కమర్షియల్ సినిమాలలో నటించడం కంటే కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడి ఓరియంటెడ్ సినిమా లలో నటించడానికి ఎక్కువ ప్రాముఖ్యత చూపుతోంది. తమిళ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ పాత్ర చేయాలి అంటే అది నయనతార మాత్రమే చేయాలి అనేంత క్రేజ్ ను ఈ లేడీ సూపర్ స్టార్ సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా నయన తార వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: