బన్నీ కూతురుపై సమంత షాకింగ్ కామెంట్స్..!

MADDIBOINA AJAY KUMAR
గ్లామర్ పాత్ర‌లు ప‌క్క‌న పెడుతూ విలక్షణ పాత్రలు చేస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్న సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అంతే కాకుండా నాగ చైతన్య తో విడాకుల తర్వాత మొదటిసారి సమంత ఈ ఇంటర్వ్యూ లోనే పాల్గొంది. ఇక ఇంటర్వ్యూలో సమంతను తన పాత్ర గురించి అడగ్గా....ఒక నటిగా రొటీన్ పాత్రలు చేస్తున్నానని తనకు తానే ప్రశ్నించుకుని తానే చాలెంజ్ గా తీసుకుని కొత్త పాత్రలు చేస్తున్నట్టు వెల్లడించింది. అలా డిఫరెంట్ గా చేస్తున్న సినిమాల్లో శాకుంతలం కూడా ఒకటి అని చెప్పింది. శాకుంతలం సినిమాలో ప్రతి సన్నివేశం ఒక అద్భుతంలా ఉంటుందని సమంత వెల్లడించింది. ఈ సినిమాలో ఎప్పుడూ కనిపించనంత అందంగా కనిపిస్తానని తనకు పౌరాణికాలు అంటే ఎంతో ఇష్టమని సమంత చెప్పుకొచ్చింది. 

తాను పౌరాణిక కథలు చదువుతున్నప్పుడు మహారాణిలా ఊహించుకునేదానిన‌ని ఇప్పుడు అలాంటి పాత్రలో నటించే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని శాకుంతలం టీంతో వర్క్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది. ఇక శాకుంతలం సినిమాలో అల్లు అర్జున్ త‌న‌య‌ అల్లు అర్హ గురించి సమంతను ప్రశ్నించగా ఆసక్తికర కామెంట్ లు చేసింది. అల్లు అర్హ పుట్టుకతోనే రాక్ స్టార్ అంటూ సమంత పొగడ్తల వర్షం కురిపించింది. షూటింగ్ సెట్స్  టెక్నీషియన్లు మూడు వందల మంది కళాకారులు ఉన్నా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుందని చెప్పింది. అల్లు అర్హ‌ సినిమా ఇండస్ట్రీని ఏలుతుంది అంటూ సమంత పొగడ్తలు కురిపించింది.

అర్హ నుండి తాను ఇవి గమనించాన‌ని సినిమా చూసిన తర్వాత మీరు కూడా ఏకీభవిస్తారు అంటూ సమంత వ్యాఖ్యానించింది. అంతేగాకుండా సౌత్ లో బిజీగా ఉన్న సమయంలోనే తనకు బాలీవుడ్ నుండి చాలా అవకాశాలు వచ్చాయి అని సమంత పేర్కొంది. అయితే అప్పుడు బాలీవుడ్ సినిమాలకు నో చెప్పాన‌ని తెలిపింది. కానీ ఫ్యామిలీ మ్యాన్-2 లో రాజీ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొంది. ఫ్యామిలీ మ్యాన్ తో బాలీవుడ్ లో మేకింగ్ గురించి తెలుసుకున్నాన‌ని చెప్పింది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించడంతో త‌న కాన్ఫిడెన్స్ ఎంతో పెరిగిందని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: