ఫ్యాక్షన్ సినిమాల సత్తా చాటిన బాలకృష్ణ సమరసింహారెడ్డి

P.Nishanth Kumar
బి.గోపాల్  దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా 1999వ సంవత్సరంలో తెరకెక్కిన చిత్రం సమరసింహారెడ్డి. సిమ్రాన్ అంజలి జవేరి కథానాయికలుగా జయప్రకాశ్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆ రోజుల్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఫ్యాక్షన్ చిత్రాల్లోనే సరికొత్త ఒరవడిని సృష్టించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి కథ అందించగా ఓ తమిళ చిత్రం లోని లైన్ ను ఈ సినిమా ప్రధాన ఇతివృత్తంగా స్వీకరించి ఈ చిత్ర కథను తయారు చేశానని ఆయన తెలిపారు. 

ఆ తమిళ చిత్రమే సింధూరపువ్వు. ఈ సినిమాలో ఒక ఆవిడ తన కూతుర్ని బాగా చూసుకొని సవతి పిల్లలను బాగా చూడదు. వారిని రోజు రాచి రంపాన పెడతాడు. అది నచ్చని ఆవిడ సవతి కొడుకు తన చెల్లెల్ని వదిలేసి పారిపోయి హీరో దగ్గర డ్రైవర్ గా చేరతాడు. హీరో ఓ పెద్ద డాన్. ఆయనపై కొంతమంది దాడి చేసినప్పుడు ఆ డాన్ ను కాపాడేందుకు వెళ్లి డ్రైవర్ చనిపోతాడు. అతని వెనుక ఉన్న కథను తెలుసుకున్న కథానాయకుడు అతని కుటుంబంలో కి అతని పేరు మీద వెలతాడు.

అలా వెళ్లిన హీరో వాళ్ళ కష్టాల నుంచి ఎలా బయట పడేస్తాడు అనే ప్రధానమైన ఇతివృత్తం కాగా ఇదే కథ ను స్వీకరించి సమర సింహా రెడ్డి కథ ను రాసి సినిమా గా చేశాను అని చెప్పాడు. అయితే ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. కథ ఫ్లాష్ బ్యాక్ చెప్పే విధానంలో చాలా మార్పులు చేశాము. అలాగే కథానాయకుడి చేతిలోనే ఆ పనివాడు చనిపోయే విధంగా కథను సృష్టించి బాలకృష్ణ కు అబ్బేల  ఈ సినిమా చేసాము అని చెప్పాడు. ఆ విధంగా ఈ సినిమాకు రాయలసీమ బ్యాక్ డ్రాప్ గా తీసుకొని ఆ ప్రాంత నేపథ్యం తో దశాబ్దానికి పైగా తెలుగు సినిమా ను ప్రభావితం అయ్యేలా చేశారు విజయేంద్ర ప్రసాద్. మొదట సమరసింహా రెడ్డి సినిమా బ్యాక్ డ్రాప్ బొంబాయి మాఫియా నేపథ్యంలో చేద్దామని అణుకోగా అప్పటికి విజయేంద్రప్రసాద్ సలహాదారుడిగా పనిచేస్తున్న రత్నం సలహా మేరకు ఈ చిత్రాన్ని రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం గా ఎంచుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: