నటకీరిటి మార్క్ బెస్ట్ కామెడీ ఏప్రిల్ ఒకటి విడుదల

GVK Writings
టాలీవుడ్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తన కెరీర్ ని మొదట జంధ్యాల గారి సినిమాలతో మొదలెట్టారు. బాలయ్య, సుత్తి వీరభద్రావు ల బాబాయ్ అబ్బాయ్ సినిమాలో ఎంతో చిన్న నిడివి గల పాత్ర చేసిన రాజేంద్ర ప్రసాద్ ఆ తరువాత నుండి మెల్లగా తన టాలెంట్ తో ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్నారు. ఆపైన టాలీవుడ్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించడంతో పాటు అక్కడక్కడా కొన్ని నెగటివ్ రోల్స్ కూడా చేసిన రాజేంద్రప్రసాద్, ఆపైన అప్పటి పలువురు దిగ్గజ దర్శకులతో సినిమాలు చేసారు.
ఇక అప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా సినిమాలు తీసి అద్భుత సక్సెస్ లు అందుకున్న దర్శకుల్లో సీనియర్ వంశీ కూడా ఒకరు. ఇక ఆయనతో రాజేంద్ర ప్రసాద్ కొన్ని సినిమాలు వర్క్ చేయగా అందులో చాలా వరకు మంచి సక్సెస్ అందుకున్నవే కావడం విశేషం. ఇక వీరిద్దరి కలయికలో వచ్చిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ ఒకటి విడుదల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. శోభన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఇళయరాజా అందించిన సాంగ్స్, నేపధ్య సంగీతం ఎంతో గొప్ప ఆదరణ సొంతం చేసుకున్నాయి.
హరిశ్చంద్ర అన్నీ అబద్దాలే అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో సుద్ద అబద్దాల కోరు దివాకరం పాత్రలో తన సహజ నటన కామెడీ తో నటకిరీటి చేసిన యాక్టింగ్ కి సర్వత్రా ప్రశంసలు కురిసాయి. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ శోభన తో పాటు దాదాపుగా ప్రతి ఒక్క పాత్ర మనల్ని ఎంతో గిలిగింతలు పెడుతుంది. ప్రస్తుతం కమెడియన్ కృష్ణ భగవాన్ విలన్ గా నటించిన ఈ సినిమా తరువాత రాజేంద్ర ప్రసాద్, వంశీ ల కాంబోకి మరింత మంచి క్రేజ్ దక్కింది. ఎంతైన రాజేంద్ర ప్రసాదా మజాకా

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: