జంధ్యాల "అహానా పెళ్ళంట" చిత్రం ఐడియా ఎవరికొచ్చిందో తెలుసా?

VAMSI

ప్రముఖ టాలీవుడ్ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హీరోగాను, క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను సినీ రంగంలో తనకంటూ సూపర్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఘనత ఈయనకు దక్కింది. అప్పట్లో ఈయన హీరోగా తెరకెక్కిన చిత్రాలంటే ప్రజలకు పంచప్రాణాలు. రాజేంద్రప్రసాద్ సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు సినిమా హాల్ లోకి వెళ్లాలా అంటూ వేచి చూస్తుంటారు. అంతగా ఆయన సినిమాలు ఆకర్షిస్తాయి. హీరో అంటే కేవలం హీరోయిజం చూపించడమే కాదు కామెడీ కూడా చేసి వచ్చిన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలగాలి అనుకునే అరుదైన హీరోల్లో ఈయన కూడా ఒకరు. అప్పట్లో రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ కామెడీనే ప్రధానంగా ఉండేది.
 
మరోవైపు దర్శకుడు జంధ్యాల హాస్యబరిత చిత్రాలకు పెట్టింది పేరు. అప్పట్లో కామెడీ సినిమాలంటే జంధ్యాల గారిదే ప్రథమ స్థానం. సహజసిద్ధమైన హాస్యాన్ని తన సినిమాలో రంగరించి కుటుంబ సమేతంగా ప్రేక్షకులు తన చిత్రాలను ఆస్వాదించేలా వాటిని రూపుదిద్దే దర్శక బ్రహ్మ. ఇక అటు జంధ్యాల..ఇటు రాజేంద్ర ప్రసాద్ వీరిద్దరి కాంబో అనగానే "ఆహనా పెళ్ళంట" చిత్రం గుర్తుకు రావాల్సిందే. కామెడీ చిత్రాలతో కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి కలెక్షన్ సునామీ తెప్పించవచ్చని నిరూపించిన చిత్రం ఇది. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే ఒక అద్భుతమైన బంగారు పేజీ. సినిమాలోని నటీనటులందరికి గుర్తింపు ఏ స్థాయిలో వచ్చింది అంటే...ఈ చిత్రం తర్వాత వారి కెరీర్ పరుగులు తీసింది. ప్రతి ఒక్కరూ బిజీ అయిపోయారు. దర్శకుడు జంధ్యాల తన సత్తా చాటి టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా రాణించారు.
ముఖ్యంగా హీరో రాజేంద్రప్రసాద్ ఈ సినిమా తరువాత వెనుతిరిగి చూసింది లేదు. ఇక నటుడు కోట శ్రీనివాసరావు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కాంబినేషన్ లో కామెడీ ఫుల్ ఫేమస్ అయిపోయింది. బ్రహ్మానందం బెస్ట్ కమెడియన్ గా బిజీ అయిపోయారు. 1987 నవంబర్ 27 న రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని అందుకుంది. అసలు ఈ సినిమా ఆలోచన ఎలా మొదలైంది అంటే.. ఓనాడు రామానాయుడుగారు ఒక చిన్న జోక్ ను చదివి బాగా నవ్వుకున్నారు. జోక్ వింటేనే ఇంత నవ్వు వస్తే..చూస్తే మరెంత పగలబడి నవ్వొచ్చు అనిపించిందట. వెంటనే అదే ఆలోచనలతో కామెడీ సినిమా తీయాలంటూ జంధ్యాలను పిలిపించి చెప్పారట. ఇక  కథ కోసం రచయిత ఆది విష్ణు పల్లకి వారపత్రికలో రాసిన "సత్యం గారి ఇల్లు"  సీరియల్ ని బేస్ చేసుకుని దానికి ప్రేమ, హాస్యం, సెంటిమెంట్ వంటి అంశాలను బాగా దంచి కొట్టి స్క్రిప్ట్ రెడీ చేసుకుని సినిమా మొదలెట్టేశారు.
అలా అన్ని రుచులతో కలగలిపి వండిన అద్భుతమైన చిత్రం  "అహ నా పెళ్ళంట". ఈ సినిమా వచ్చి ఇప్పటికీ 34 ఏళ్లు దాటుతున్నా లెక్కలేనన్ని సార్లు చూసినా మళ్ళీ చూస్తే ఎంతో ఫ్రెష్ గానే అనిపిస్తుంది. కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు.  ఇక మరో విశేషం ఏమిటంటే ఈ కథ విని మొదట విక్టరీ వెంకటేష్ నాన్నగారు రామానాయుడుతో ఈ సినిమా చేయడానికి నేను రెడీ అన్నారట..కానీ ఈ కథ ప్రసాద్ కైతే బాగా సూట్ అవుతుందని చెప్పి ఆయన తన చిత్రాన్ని తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: