30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్..!

Divya
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమదైన శైలిలో నటించి ప్రేక్షకులలో ఒక ముద్రను వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి.. వీరు సహాయక పాత్రల్లో నటించి, కొన్నికొన్ని డైలాగులతో ప్రేక్షకులలో చిరస్థాయిగా మిగిలిపోతూ ఉంటారు అలాంటి వారిలో పృథ్వీరాజ్ కూడా ఒకరు.. ఈయన 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ ప్రతి సినిమాలో కూడా తనదైన శైలిలో డైలాగ్స్ చెప్తూ, ప్రేక్షకులకు కూడా ఈ డైలాగులు బాగా అలవాటు చేశాడు అని చెప్పవచ్చు.. ముఖ్యంగా తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

ఈయన పూర్తి పేరు బలిరెడ్డి పృథ్వీరాజ్.. హాస్యనటుడిగా,  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  ప్రతినాయకుడి పాత్రలో కూడా నటించాడు. మొదటిసారి 1993వ సంవత్సరంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించి మెప్పించారు. ఆ తర్వాత ఖడ్గం సినిమా ద్వారా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగుతో బాగా పాపులర్ అందుకున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా వచ్చిన లౌక్యం సినిమాలో కూడా బాయిలింగ్ స్టార్ బబ్లు అంటూ వచ్చి బాగా అలరించాడు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కి చెందిన పృథ్వి రాజ్ ఎమ్.ఏ పూర్తి చేశాడు. 1992 వ సంవత్సరంలో ఎం ప్రభాకర్ రెడ్డి  సహాయంతో మద్రాసు వెళ్లి సినీ ఇండస్ట్రీలో అవకాశం పొందాడు. అంతకుముందు హోటల్ లో రిసెప్షన్ మేనేజర్ గా పృథ్వీరాజు కు ఉద్యోగం ఇప్పించింది ప్రభాకర్ రెడ్డి గారే.. ఎంత కాలం ఇక్కడ ఉన్న సినిమాలో అవకాశాలు రావని , సిటీ కేబుల్ లో దర్శకులను ఇంటర్వ్యూ చేస్తే అవకాశాలు వస్తాయని అక్కడ కూడా కొద్ది రోజులు పనిచేయడంతో ఈవీవీ సత్యనారాయణ ఈయనకు అవకాశం కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: