స్టార్ హీరోల కి షాకిచ్చిన బాలకృష్ణ మూవీ..ఒకేసారి అన్ని కోట్లా..?
ప్రతి సంక్రాంతికి మన స్టార్ హీరో సినిమాలు ఏవో ఒకటి విడుదల అవుతూనే ఉంటాయి. అలా 2001 లొ సంక్రాంతి కానుకగా జనవరి 11 తేదీన బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు మూవీ విడుదలైంది. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ ని మలుపు తిప్పిన అని చెప్పుకోవచ్చు. బాలకృష్ణ కెరియర్ లోనే అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపుగా 30 కోట్ల రూపాయలను రాబట్టింది.
ఈ సినిమాకి డైరెక్టర్ బి.గోపాల్ నిర్మించారు. ఇక జనవరి 11 వ తేదీనే మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు మూవీ కూడా విడుదలైంది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ నిర్మించాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాలు మీద విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచింది. ఇక బాలకృష్ణ ఆ సంవత్సరం ఫుల్ ఖుషీగా ఉండగా చిరంజీవికి మాత్రం నిరాశ తప్పలేదు.
ఇక ఈ సినిమాలు విడుదలైన తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ లోనే కోడి రామకృష్ణ డైరెక్షన్ లో హీరో వెంకటేష్ తో తీసిన చిత్రం"దేవి పుత్రుడు".ఈ సినిమా కూడా డిజాస్టర్ తో భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ సినిమా కు నిర్మాత ఎమ్మెస్ రాజు.ఇక బాలకృష్ణ సినిమా వల్లే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే.. ఆ సినిమా కి గట్టి పోటీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోవచ్చు.