బన్నీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్.. ఫాన్స్ ఫుల్ ఖుషి?

praveen
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అటు మారేడుపల్లి అడవుల్లో జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా అటు క్యాలిక్యులేటర్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తూ ఉండడంతో.. పుష్పాలో ఎన్ని కాలిక్యులేషన్స్ ఉండబోతున్నాయో అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా కొత్తగా కనిపించడం అటు ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచేసింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా షూటింగు ఈ నెలాఖరు వరకు పూర్తి కానుందని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది.

 క్రిస్మస్ కానుకగా పుష్పా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సింప్లిసిటీ తో ప్రేక్షకులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో దారిలో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఆకలేసింది అంటే స్టార్ హోటళ్ ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటారు. స్టార్ హోటల్ కనిపించేంత వరకు వెళ్లి  అక్కడ ఏదైనా తినడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పని మాత్రం  సింప్లిసిటీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఇటీవలే అల్లు అర్జున్ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఏకంగా ఒక రోడ్ సైడ్ టిఫిన్ బండి దగ్గర ఆగి అక్కడే టిఫిన్ చేశారు.  అయితే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో  రోడ్ సైడ్ టిఫిన్ బండి దగ్గరికి రావడం తో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.  ఇక అక్కడ టిఫిన్ చేసిన అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళుతూ టిఫిన్ బండి నడుపుతున్న వ్యక్తికి కొన్ని డబ్బులు ఇచ్చి కారు ఎక్కారు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన అభిమానులు  అల్లు అర్జున్ అంత స్టార్ హీరోయిన్ అయినప్పటికే ఎంత సింప్లిసిటీ తో ఉన్నారు. అది అల్లు అర్జున్ అంటే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: