ఒక్క నెలలోనే నాలుగు సినిమాలు.. హీరో ఎవరంటే?

P.Nishanth Kumar
గతంలో చాలా మంది హీరోలు ఒకే సంవత్సరం పదికి పైగా సినిమాలు విడుదల చేసే వారు. కానీ రాను రాను ఆ విధంగా సినిమాలను విడుదల చేసే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. సంవత్సరానికి ఒక సినిమాను విడుదల చేయడమే గగనం అయిపోయింది. కానీ ఇటీవలే ఓ హీరో తన నాలుగు సినిమాలను ఒకే నెలలో విడుదల చేస్తూ సెన్సేషనల్ రికార్డు ను సృష్టిస్తున్నారు. ఒక హీరో సినిమా నెల రోజుల వ్యవధిలో రెండు రిలీజయితే ఆశ్చర్యపోవాల్సిన రోజులలో ఒక హీరో సినిమాలు నాలుగు ఒకే నెలలో విడుదల అవడం ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది.

ఇంతకీ ఒక వారం వ్యవధిలోనే మూడు చిత్రాలు ఒక నెల రోజుల వ్యవధిలో నాలుగు చిత్రాలన్ని విడుదల చేస్తున్న హీరో ఎవరంటే విజయ్ సేతుపతి. హీరో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎలాంటి పాత్ర అయినా సరే తన ప్రత్యేకతను చాటుకునే విధంగా గా ఉంటే విజయ్ సేతుపతి ఆ సినిమాలు చేయడానికి ఒప్పుకుంటాడు. గ్యాప్ లేకుండా ఎన్ని సినిమాల నైనా తెరకెక్కిస్తున్నాడు. ఆయన గత ఏడాదిలో దాదాపు అరడజను సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను అలరించగా అందులో మూడు చిత్రాలు ఆయన హీరోగా నటించిన చిత్రాలు కావడం విశేషం. మిగితావ ఇతర పాత్రల్లో నటించిన సినిమాలు.

ఈ ఏడాది కూడా ఆయన చాలా సినిమాల్లో నటిస్తుండగా ఓ నాలుగు సినిమాలు ఒకే నెలలో విడుదల అవుతుండటం విశేషం. లాభం సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తుగ్లక్ దర్బార్ అనే సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రాబోతుంది. అంతేకాకడా తాప్సీతో కలిసి విజయ్ సేతుపతి నటిస్తున్న ఆనబెల్ సేతుపతి సినిమా కూడా హాట్ స్టార్ లో విడుదల అవుతుంది. ఇంకా విజయ్ సేతుపతి ఓ ప్రత్యేక పాత్రలో నటించిన కడై వేవసయి అనే సినిమా కూడా ఈ నెలలోనే విడుదల కాబోతుంది. ఇలా నాలుగు చిత్రాలను ఒకే నెలలో విడుదల చేస్తూ తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాడు విజయ్ సేతుపతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: