బిగ్ బాస్ లోకి ఆ స్టార్ సింగర్..!

Pulgam Srinivas
'బిగ్ బాస్' తెలుగు సీజన్ ఫైవ్ కు అంతా సిద్ధం అయ్యింది. ఇప్పటికే హౌస్ సెట్టింగ్ పూర్తి అవగా, ప్రమోషన్ లో భాగంగా 'బిగ్ బాస్' ప్రోమో ను కూడా విడుదల చేశారు. దీనికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. నాగార్జున కూడా 'బిగ్ బాస్' షో కు హోస్ట్ గా వ్యవహరించడానికి రెడీగా ఉన్నాడు. అయితే 'బిగ్ బాస్' హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది వీరే అంటూ కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. అందులో విశ్వ, యాంకర్ రవి, సరయు, కొరియోగ్రాఫర్ నటరాజ్, యానీ మాస్టర్, లోబో, మానస్‌, ఉమా దేవి, జశ్వంత్‌, ట్రాన్స్‌జెండర్‌ ప్రియాంక, వీజే సన్నీ, ఆర్జే కాజల్‌, షణ్ముఖ్‌ జస్వంత్‌, ప్రియ, వర్షిణి, లహరి శ్రీ వీరి పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి.

 ఈ లిస్టులో మరిన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం లేకపోలేదు. ప్రతిసారి 'బిగ్ బాస్' హౌస్ లో ఒక సింగర్ ఉన్నట్టే ఈసారి కూడా ఒక సింగర్ ఉండాలి అని బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకోసం సింగర్ శ్రీరామచంద్ర  ను 'బిగ్ బాస్' షో లోకి రప్పిస్తున్నారని సమాచారం. 2010 వ సంవత్సరం ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకున్న శ్రీరామచంద్ర పాటలు పాడటంతో పాటు కొన్ని సినిమాలలో నటించి మెప్పించాడు. శ్రీరామచంద్ర గణక  'బిగ్ బాస్' హౌస్ లోకి వచ్చినట్లయితే తన పాట , నటనతో అందరి మనసులు గెలుచుకుంటాడు అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
గత సీజన్ లో గీతా మాధురి , రాహుల్ సిప్లిగంజ్  లాంటి సింగర్ లు జనాలను ఎంతగానో అలరించారు. శ్రీ రామచంద్ర కూడా అలాగే జనాలను అలరిస్తాడు అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే ఈ సింగర్ 'షో' లోకి అడుగుపెట్టానున్నాడా..? ఒకవేళ ఎంట్రీ ఇస్తే తన గాత్రంతో బిగ్ బాస్ వీక్షకుల మనసు దోచుకోనున్నాడా..? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: