శింబు రెడ్ కార్డును రద్దు చేసిన నిర్మాతల మండలి..!

Pulgam Srinivas
కోలీవుడ్ హీరో శింబు తమిళ మార్కెట్ లో ఎంత క్రేజ్ ని సంపాదించుకున్నాడో, తెలుగులోనూ అంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు అనడంలో ఏమాత్రం వెనకడాల్సిన అవసరం లేదు. 'మన్మధ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శింబు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు శింబు నటనకు కూడా తెలుగు ప్రజల నుండి మంచి మార్కులే పడడంతో ఈ హీరో అదే జోష్ లో  తాను  నటించిన అనేక  సినిమాను తెలుగులో డబ్ చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే నయనతార హీరోయిన్ గా నటించిన 'వల్లభ' సినిమాను కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మంచి విజయాన్ని దక్కించుకుంటాడు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'నవాబ్' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు .

కానీ ఆ తర్వాత మాత్రం శింబు అనేక సినిమాలలో నటించిన బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ సినిమాలు ఈ హీరోకు నిరాశనే మిగిల్చాయి. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం శంభో హీరో గా 'అన్బాదవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌' అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను నిర్మించిన మైఖేల్‌ రాయప్పన్‌ శింబు ఏ మాత్రం సహకరించక పోవడం వల్లే తాను రూ.2 కోట్లు నష్టపోయానని తమిళ సినిమా నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) ఫిర్యాదు చేశారు. శంభు నష్టపరిహారం చెల్లించాలని నిర్మాతల మండలి తీర్మానం చేసిన కూడా ఏమాత్రం ఫలితం లేకపోవడంతో హీరో శింబు కు నిర్మాతల మండలి రెడ్ కార్డును విధించారు. ఈ వ్యవహారంపై శింబు తల్లి ఉష ఇటీవల నిర్మాతల మండలికి లేఖ రాశారు. ఆ తర్వాత నిర్మాతల మండలికి శింబుకు కు మధ్య జరిగిన చర్చల్లో ఈ వివాదానికి పరిష్కారం లభించింది. తమిళ నిర్మాతల సంఘం శింబు  పై విధించిన రెడ్ కార్డును రద్దు చేసింది. ఈ విధంగా నటుడు శింబు కు ఊరట కలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: