'చక్రసిద్ధ' వైద్యశాల ని ప్రారంభించిన మహేష్ దంపతులు ... మీడియాలో ఫోటోలు వైరల్ .... !!

GVK Writings
నేటి తరం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు రోజుల క్రితం తన 46వ జన్మదినాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రతి ఏడాది పుట్టినరోజున ఫ్యాన్స్ కి తన సినిమాలకు సంబందించిన ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసే సూపర్ స్టార్, ఈ ఏడాది కూడా తన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట నుండి బ్లాస్టర్ పేరుతో ఫస్ట్ లుక్ టీజర్ ని అలానే తదుపరి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్న మూవీ అనౌన్స్ మెంట్ ని గిఫ్ట్ గా అందించారు. ఇక సర్కారు వారి పాట బ్లాస్టర్ అయితే సూపర్ రెస్పాన్స్ దక్కించుకుని అందరిలో విపరీతంగా సినిమాపై అంచనాలు పెంచింది.
మరోవైపు త్రివిక్రమ్ సినిమా కూడా అన్ని అంచనాలు అందుకునేలా పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. సర్కారు వారి పాట లో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా పరశురామ్ ఈ సినిమాని ఎంతో గ్రాండ్ గా తీస్తున్నారు. ఈ మూవీ రాబోయే సంక్రాంతికి విడుదల కానుంది. త్రివిక్రమ్ సినిమా షూట్ ని నవంబర్ లో ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయనున్నారు. ఇక తన సినిమాలతో పాటు పలు సోషల్ యాక్టివిటీస్ లో కూడా చురుగ్గా పాల్గొని తనవంతుగా వీలైనంతలో సామజిక సేవ చేస్తున్నారు మహేష్ బాబు. అయితే ఇటీవల తనకు కొంత అనారోగ్య సమస్యలు తలెత్తాయని, కొన్నిసార్లు సరిగా నిద్ర పట్టేది కాదని ఆసమయంలో తనకు తెలిసిన కొందరి సలహా ద్వారా డాక్టర్ సత్య సింధూజ గారిని సంప్రదించి చక్రసిద్ద వైద్యం చేయించుకున్నానని, ఆ తరువాత ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని అప్పట్లో ఒక మీడియా ఛానల్ కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు మహేష్.
ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే, నేడు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ శంకర్ పల్లి లో డాక్టర్ సత్య సింధూజ నూతనంగా ఏర్పాటు చేసిన చక్రసిద్ద వైద్యశాలని తన సతీమణి నమ్రత తో కలిసి ప్రారంభించారు మహేష్. గతంలో తాను ఈ చక్రాసిద్ద వైద్యం ద్వారా ఎంతో లాభం పొందానని, ఇటువంటి వైద్యం అందరికీ ఎంతో ఉపయోగకరం కావాలి అంటూ నేడు మహేష్ మాట్లాడుతూ చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో ప్రముఖ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి, యాంకర్ సుమ, రాజీవ్ కనకాల దంపతులు కూడా పాల్గొన్నారు. కాగా ఈ వేడుక తాలూకు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి .... !!

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: